అక్కడే బాగున్నా.. ఇక్కడే ఆసక్తి అట !

స్టార్ హీరోయిన్ అవ్వాలనే కసితో వచ్చి ఇంకా ఆ ఆశతోనే తెలుగుతో పాటు తమిళ, హిందీ ఇండస్ట్రీల చుట్టూ తిరుగుతున్న బ్యూటీ ‘రాశి ఖన్నా’. ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో కన్నా ఇతర భాషల్లోనే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయనేది వాస్తవం. మొదటి నుండి రాశి తెలుగు పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అయినా, తెలుగు మేకర్స్ ఈ భామను సరిగ్గా వాడుకోలేదు. దాంతో స్టార్ హీరోల సరసన ఎక్కవుగా ఆడిపాడే అవకాశాలు సంపాదించలేకపోయింది. Also Read: ప్రభాస్‌ బాడీపై […]

Written By: admin, Updated On : March 7, 2021 6:05 pm
Follow us on


స్టార్ హీరోయిన్ అవ్వాలనే కసితో వచ్చి ఇంకా ఆ ఆశతోనే తెలుగుతో పాటు తమిళ, హిందీ ఇండస్ట్రీల చుట్టూ తిరుగుతున్న బ్యూటీ ‘రాశి ఖన్నా’. ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో కన్నా ఇతర భాషల్లోనే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయనేది వాస్తవం. మొదటి నుండి రాశి తెలుగు పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అయినా, తెలుగు మేకర్స్ ఈ భామను సరిగ్గా వాడుకోలేదు. దాంతో స్టార్ హీరోల సరసన ఎక్కవుగా ఆడిపాడే అవకాశాలు సంపాదించలేకపోయింది.

Also Read: ప్రభాస్‌ బాడీపై శ్రీరెడ్డి హాట్‌ కామెంట్స్‌

ఓ దశలో బికినీలకి కూడా రెడీ అంటూ పబ్లిక్ గా టాలీవుడ్ మేకర్స్ కి వినిపించేలా మెసేజ్ లు పాస్ చేసినా.. ఎందుకో రాశి ఖన్నాకి భారీ సినిమాలు రాలేదు. వచ్చినా చిన్నాచితకా ఏవరేజ్ సినిమాలు కూడా ఆమెకు సరైన హిట్స్ ను అందించలేకపోయాయి. ఇక ఇలాగే తెలుగు ఇండస్ట్రీని పట్టుకుని వేలాడితే.. వయసు కాస్త కరిగిపోతుంది అని బావించిన ఈ బబ్లీ బ్యూటీ.. మొత్తానికి ఇతర ఇండస్ట్రీల చుట్టూ తిరుగుతుంది.

Also Read: చిరంజీవి రీమేక్ స్టారా..? సూప‌ర్ హిట్ల‌న్నీ అవేనా..?!

ఈ క్రమంలోనే తమిళం, హిందీ, మలయాళం భాషల్లో మంచి ఛాన్స్ లనే పట్టింది. ప్రస్తుతం రాశి ఆయా ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అవుతోంది. హిందీలో అయితే ఏకంగా షాహిద్ కపూర్ సరసన ఒక వెబ్ డ్రామాలో నటిస్తోంది. అలాగే తమిళంలో కూడా రెండు సినిమాలు చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ సరసన నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ లోనే ఉంది రాశి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

పైగా హిందీలో సూపర్ హిట్టైన అంధధూన్ రీమేక్ ఈ సినిమా. బాలీవుడ్ లో రాధికా ఆప్టే చేసిన పాత్రలో రాశి ఖన్నా కనిపించబోతుంది. ఏది ఏమైనా రాశికి తెలుగు అవకాశాల పైనే ఎక్కువ ఆసక్తి అట. అందుకే తానూ హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నానని, కాకపోతే ఎందుకో నాకు తెలుగులో మాత్రం అవకాశాలు తక్కువగా వస్తున్నాయని ఫీల్ అవుతుంది.