కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు షాక్.. వాళ్లలో బ్లాక్ ఫంగస్..?

కరోన ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తోంది. కరోనా వైరస్ బారిన పడిన వాళ్లు స్థిరాయిడ్లు వాడినా, మధుమేహంతో బాధ పడుతున్నా బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొందరు కరోనా రోగులు బ్లాక్ ఫంగస్ బారిన పడినట్టు తెలుస్తోంది. బ్లాక్ ఫంగస్ ను గుర్తించడం ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాకపోయినప్పటికీ […]

Written By: Kusuma Aggunna, Updated On : May 14, 2021 11:47 am
Follow us on

కరోన ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తోంది. కరోనా వైరస్ బారిన పడిన వాళ్లు స్థిరాయిడ్లు వాడినా, మధుమేహంతో బాధ పడుతున్నా బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొందరు కరోనా రోగులు బ్లాక్ ఫంగస్ బారిన పడినట్టు తెలుస్తోంది. బ్లాక్ ఫంగస్ ను గుర్తించడం ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి.

బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాకపోయినప్పటికీ చికిత్స ఆలస్యమైతే మాత్రం పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. మొదట మహారాష్ట్రలో గుర్తించిన ఈ వ్యాధి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుండటం గమనార్హం. ఫంగస్ మెదడుకు పాకినా ముప్పేనని తొలి దశలోనే లక్షణాలను గుర్తిస్తే చికిత్స అందించి వ్యాధిని నయం చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ కొత్తదేం కాదు.

రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేనివాళ్లు గతంలో ఈ ఫంగస్ బారిన పడేవాళ్లు. కరోనా ఫస్ట్ వేవ్ లో స్టిరాయిడ్ల వాడకం పెద్దగా లేకపోవడం వల్ల బ్లాక్ ఫంగస్ పెద్దగా కనిపించలేదు. విచక్షణ లేకుండా స్టిరాయిడ్స్ వాడేవాళ్లకు ఈ ముప్పు ఎక్కువగా ఉంది. తొలిదశలోనే బ్లాక్ ఫంగస్ ను గుర్తిస్తే యాంఫోటెరిసిన్ బి ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా బ్లాక్ ఫంగస్ ను నియంత్రించడం సాధ్యమవుతుంది.

ప్రాథమిక దశలో చికిత్స అందిస్తే 90 శాతం వరకు నయమయ్యే అవకాశం ఉంటుంది. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ.ఎన్.టీ వైద్యులను సంప్రదిస్తే మంచిది. అయితే బ్లాక్ ఫంగస్ అందరికీ రాదని ఆందోళన చెందవద్దని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.