Site icon OkTelugu

Dhurandhar 2 Release Delay Reasons: ‘ధురంధర్ 2 ‘ చివరి నిమిషం లో వాయిదా పడనుందా ? కారణాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

Dhurandhar 2 Actors Remuneration

Dhurandhar 2 Actors Remuneration

Dhurandhar 2 Release Delay Reasons: మరో 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ‘ధురంధర్ 2 : ది రివెంజ్'(Dhurandhar 2 : The Revenge) సీక్వెల్ విడుదలకు సిద్ధం కాబోతుంది. ఈ సినిమా కోసం నార్త్ ఇండియన్స్ ఎంతలా అయితే ఎదురు చూస్తున్నారో, సౌత్ ఇండియన్ మూవీ లవర్స్ కూడా అంతలా ఎదురు చూస్తున్నారు. మొదటి భాగం ‘ధురంధర్’ కమర్షియల్ గా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీ బాషలోనే 1400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించడం తో పాటు, నెట్ ఫ్లిక్స్ లో హిందీ తో పాటు, ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో కూడా విడుదలై అమోఘమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అందుకే ఈ చిత్రానికి ఈ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ మార్కుని దాటింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ చిత్రం పై ఏ రేంజ్ క్రేజ్ ఉంది అనేది.

Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!

అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. CBFC సభ్యులు ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ని జారీ చేశారు. అసలు సెన్సార్ సర్టిఫికేట్ ఈరోజు వస్తుందా లేదా ?, సినిమా విడుదల అవుతుందా లేదా అనే టెన్షన్ ప్రతీ ఒక్కరిలోనూ కలిగింది. కానీ చివరి నిమిషం లో సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ జారీ చేయడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో సమస్య ఒకటి ఏర్పడింది. కంటెంట్ ఇప్పటి వరకు ఓవర్సీస్ కి పూర్తి స్థాయిలో డెలివరీ అవ్వలేదట. కేవలం ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన కంటెంట్ మాత్రమే డెలివరీ అయ్యిందట. సెకండ్ హాఫ్ కి సంబంధించి ఇంకా కొంత వర్క్ జరుగుతుందని, ఈరోజు రాత్రి లోపు పూర్తి చేసి , రేపు ఉదయం లోపు పంపేలా మేకర్స్ తెగ ప్రయత్నం చేస్తున్నారట.

అనుకున్న సమయానికి కంటెంట్ చేరకపోతే, ఓవర్సీస్ లోనే కాదు, ఇండియా లో కూడా ప్రీమియర్ షోస్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఇండియా వైడ్ గా 35 కోట్ల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అదే విధంగా ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లోనే ఈ చిత్రానికి 2 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు కేవలం ప్రీమియర్ షోస్ నుండే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టింది. ఆ రేంజ్ గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా , ఇప్పుడు కంటెంట డెలివరీ సమయానికి చేరుకోకపోతే ఆ గ్రాస్ మొత్తం నష్టపోయినట్టే . చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Exit mobile version