
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 3,43,144 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. పాజిటివ్ కాస్త తగ్గినా మరో 4వేల మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 3,44,776 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,46,809 కు చేరాయి. ఇప్పటి వరకు 2,00,79,599 బాధితులు కోలుకున్నారు.