Site icon OkTelugu

Vijay Deverakonda Rashmika honeymoon destination: విజయ్ దేవరకొండ – రష్మిక హనీమూన్ కోసం ఏ దేశం వెళ్లబోతున్నారంటే..?

Vijay Deverakonda Rashmika honeymoon destination

Vijay Deverakonda Rashmika honeymoon destination

Vijay Deverakonda Rashmika honeymoon destination: నటన మీద ఆసక్తితో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నటుడు విజయ్ దేవరకొండ… కెరియర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రాలను చేశాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. టాలెంట్ ఉంటే ఎవరైనా స్టార్ హీరోలుగా అవతరించొచ్చు అని ప్రూవ్ చేసిన నటుడు కూడా తనే కావడం విశేషం. గీతా గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ టాప్ లెవల్ కి వెళ్ళిపోయాడు. ఆ సినిమాలో నటించిన రష్మిక మందాన తో తనకి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. అది ప్రేమగా మారడమే కాకుండా రీసెంట్ గా వాళ్ళు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.

ఇక వీళ్ళ జంట చూడముచ్చటగా ఉందంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాదులో రిసెప్షన్ ఉంటుంది. ఇక ఈ రిసెప్షన్ తర్వాత ఒక నెలరోజుల పాటు వీళ్ళిద్దరు సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు.

Also Read: ప్రభాస్ , అల్లు అర్జున్ లను దాటేసిన యాష్.. ‘టాక్సిక్’ కి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే!

హనీమూన్ కోసం వీళ్ళు ఏ దేశాలు వెళుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళు మాల్దీవులతో పాటు దుబాయ్ అలాగే ఇంకా కొన్ని యూరప్ కంట్రీస్ కి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారట…మొత్తానికైతే ఈ జంట చాలా లక్కీ అంటూ అందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఒకే ప్రొఫెషన్ లో ఉంటు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు…ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అంతకు మించిన ఛాలెంజ్ లు ఉంటాయి… వాటన్నింటిని అధిగమించి ప్రేమించుకొని ఫైనల్ గా వీళ్లిద్దరు ఒకటయ్యారు. ఇక కలకాలం ఇలాగే కలిసి మెలిసి ఉండాలని, అలాగే ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలని కోరుకుందాం…

Exit mobile version