ఓటీటీ పెద్ద భూతం.. లెక్కిస్తున్న నాగార్జున !

తెలుగు ఏకైక ఓటీటీగా ప్రత్యేకతను తెచ్చుకున్న ‘ఆహా’ సక్సెస్ వెనుక ఎన్ని కారణాలు ఉన్నా.. అందులో ప్రధాన కారణం మాత్రం లాక్ డౌన్ టైమ్. కరెక్ట్ గా ఆహా వచ్చే టైంకు కరోనా వచ్చి, జనాన్ని ఇంట్లోనే కూర్చోబెట్టింది. ఖాళీగా ఉన్న నెటిజన్లకు ఆహా ఎంటర్టైన్మెంట్ గా అనిపించడంతో, చకచకా జనాల్లోకి ఆహా వెళ్లడానికి ఈజీ అయిపోయింది. ఇప్పటికీ రోజురోజుకూ సబ్ స్క్రయిబర్లు పెరుగుతూనే ఉన్నారు. అందుకే అక్కినేని నాగార్జున కూడా ఓటీటీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని […]

Written By: NARESH, Updated On : May 8, 2021 3:05 pm
Follow us on

తెలుగు ఏకైక ఓటీటీగా ప్రత్యేకతను తెచ్చుకున్న ‘ఆహా’ సక్సెస్ వెనుక ఎన్ని కారణాలు ఉన్నా.. అందులో ప్రధాన కారణం మాత్రం లాక్ డౌన్ టైమ్. కరెక్ట్ గా ఆహా వచ్చే టైంకు కరోనా వచ్చి, జనాన్ని ఇంట్లోనే కూర్చోబెట్టింది. ఖాళీగా ఉన్న నెటిజన్లకు ఆహా ఎంటర్టైన్మెంట్ గా అనిపించడంతో, చకచకా జనాల్లోకి ఆహా వెళ్లడానికి ఈజీ అయిపోయింది. ఇప్పటికీ రోజురోజుకూ సబ్ స్క్రయిబర్లు పెరుగుతూనే ఉన్నారు.

అందుకే అక్కినేని నాగార్జున కూడా ఓటీటీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, కనీస పెట్టుబడి 400 కోట్ల వరకు అవుతుందని టాక్. పైగా అది కూడా సినిమాలు కొనడానికే, మళ్ళీ ఎలాగూ సినిమాలు కొత్తవి వస్తూనే ఉంటాయి, అవి కూడా కొంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు ఓటీటీను అప్ డేట్ చేస్తూ ఉండాలి. కాబట్టి, పెట్టుబడి అనేది పెరుగుతూనే ఉంటుంది.

ఈ లెక్కన ఫలానా ఎమౌంట్ అయితే, ఓటీటీ పెట్టుకోవచ్చు అనే లెక్కలు లాంటివి ఏమి లేవు. ఓటీటీ అనేది పెద్ద భూతం లాంటిదని, దానికి ఆకలి ఎక్కువ, ఇంతా అంతా అని ఒక ఎమౌంట్ దగ్గర పెట్టుబడి ఆగదు, అల్లు అరవింద్ సన్నిహిత వర్గాలు సుమాచారాం ప్రకారం ‘ఆహా’ కోసం ఇప్పటివరకూ వేయి కోట్లు వరకూ ఖర్చు అయిందని, వచ్చే రెండేళ్ళల్లో మరో ఐదు వందల కోట్లు పెట్టుబఢి అదనంగా అవుతుందని తెలుస్తోంది.

ఇంత భారీ పెట్టుబడితో ఓటీటీ ప్లాట్ ఫామ్ పెడితే, ఎంతవరకు గిట్టుబాటు అవుతుందని ప్రస్తుతం నాగ్ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అయితే, యాభై లక్షల మంది సబ్ స్క్రయిబర్లుగా మారినా ఓటీటీ సక్సెస్ అవుతుందట. యాభై లక్షలు అంటే అయ్యే ఛాన్స్ ఉంది. మరీ పెద్ద సినిమాలు కొనడం మీద దృష్టి పెట్టకుండా.. లో బడ్జెట్ కంటెంట్ మీద దృష్టి పెట్టి, ఆడియన్స్ ను ఆకట్టుకుంటే.. ఓటీటీ మంచి లాభాలను అందిస్తోందట.