New Zealand Vs Pakistan
New Zealand Vs Pakistan: న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ టీం మూడోవ టి20 మ్యాచ్ లో 45 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చిత్తు గా ఓడించింది. ఇక ఐదు టి20 మ్యాచ్ ల్లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచే తన సత్తా చాటుకున్న న్యూజిలాండ్ ఇంకో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఈ సిరీస్ ని కైవసం చేసుకుంది. ఇక ఇవాళ్ళ జరిగిన మూడో మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయర్ అయిన ఫిన్ అలెన్ కేవలం 62 బంతుల్లోనే 137 పరుగులు చేసి ఒక అదిరిపోయే రికార్డ్ ని కూడా సృష్టించాడు. ఇక దాంతో పాటుగా పాకిస్తాన్ టీమ్ లో బెస్ట్ బౌలర్లు గా కొనసాగుతున్న హరీస్ రావుఫ్, షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో భారీ పరుగులు రాబట్టడమే కాకుండా వాళ్ల బౌలింగ్ లో చీల్చి చెండాడు.
అలాగే మిగిలిన పాకిస్తాన్ బౌలర్లను కూడా ఎక్కడ కూడా కనికరం లేకుండా భారీ షాట్లు కొడుతూ ఒక్కొక్కరి మీద విరుచుకుపడ్డాడు. ఇకదానితో న్యూజిలాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లకు 224 పరుగులు చేసింది. ఇక దాంతో 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లో పాకిస్థాన్ టీమ్ లో బాబర్ అజమ్ ని మినహాయిస్తే ఎవరూ కూడా అంత పెద్దగా ఆకట్టుకోలేదు.దాంతో 45 పరుగుల తేడాతో న్యూజిలాండ్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇంతటి దారుణమైన పరాజయాన్ని చవి చూసిన తర్వాత పాకిస్తాన్ టీమ్ ని ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు.
ఎందుకు అంటే ఇంకో 5 నెలల్లో టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ న్యూజిలాండ్ మీద ఇంత దారుణమైన పర్ఫామెన్స్ ఇస్తూ ఆడడం అనేది నిజంగా వాళ్ల ఫెయిల్యూర్ కి నిదర్శనం అంటూ చాలామంది సీనియర్ ప్లేయర్లు సైతం పాకిస్తాన్ టీమ్ ని దారుణంగా విమర్శిస్తున్నారు.
వరుసగా మూడు మ్యాచ్ ల్లో కూడా పాకిస్తాన్ ఏమాత్రం తన మ్యాజిక్ ని చూపించకుండా దారుణంగా ఓడిపోవడం సిగ్గు చేటు అంటూ వాళ్ళని విమర్శిస్తున్నారు. ఇక మిగిలిన రెండు మ్యాచ్ ల్లో అయిన గెలిచి వాళ్ళ పరువు నిలబెట్టుకుంటారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది…