AP Govt: ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా పదవ తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల పరీక్షలను 11 పేపర్లతో నిర్వహిస్తారు. కానీ కరోనా కారణంగా గత ఏడాది కేవలం 7 పేపర్లను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. అదే విధంగా ఈ ఏడాది కూడా విద్యార్ధులపై మానసిక ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా 7 పేపర్లతోనే పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పాఠశాల ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ శుక్రవారం జీవో నెంబర్ 79 ను విడుదల చేసారు. 2020-21 లో టెన్త్ పరీక్షలను కరోనా కారణంగా నిర్వహించలేక విద్యార్థులను ఆల్ పాస్ గా ప్రకటించారు. ముందు సంవత్సరం విద్యార్థులు సాధించిన గ్రేడ్ ఆధారంగా ఆ ఏడాది టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు నిర్వహించారు.
కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఆలస్యంగా స్కూల్ లు స్టార్ట్ అయ్యాయి. దీంతో విద్యార్ధులపై ఒత్తిడి పెరిగింది. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయాల్సి రావడంతో విద్యార్ధులపై భారం ఎక్కువగా పడి ఒత్తిడికి గురి అయ్యారు. అందుకే పదొవ తరగతి విద్యార్థులకు 2021-22 ఏడాది కూడా 7 పేపర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.
కరోనా కారణంగా 2019-20, 2020-21 లో కూడా టెన్త్ పరీక్షలను 7 పేపర్లకు కుదిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న కూడా కరోనా ఉదృతి ఎక్కువుగా ఉండడం వల్ల పరీక్షలను నిర్వహించలేక పోయారు. అందుకే విద్యార్థులకు ఆల్ పాస్ చేసి గ్రేడ్లు ఇచ్చారు. ఈ ఏడాది కూడా 7 పేపర్ల నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలపై ఒత్తిడి తగ్గుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Amravati farmers: ఏపీలో ప్రతిపక్షాలను ఒకే వేదిక మీదకు తెచ్చిన అమరావతి రైతులు..
మరి మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్న నేపథ్యంలో ఈ ఏడాది అయినా అనుకున్న విధంగా పరీక్షలను నిర్వహించ గలుగుతారో లేదో వేచి చూడాలి. అంతా బాగుంటే ఈ ఏడాది టెన్త్ విద్యార్థులకు ఏడూ పేపర్లతోనే పరీక్షలు జరగనున్నాయి. ఒకవేళ కరోనా ఆపద మళ్ళీ ఉంటే ఈసారి కూడా ముందు తరగతి ఆధారంగానే గ్రేడ్లు నిర్వహించే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Also Read: Janasena: విశాఖ స్టీల్ ప్లాంట్ అస్ర్తంగా జనసేన డిజిటల్ యుద్ధం
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Class 10 exams to be conducted with 7 papers only
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com