రూ.75 లక్షల బహుమతి అందుకున్న ‘ఉప్పెన’ డైరెక్టర్

ఉప్పెన.. కరోనా లాక్ డౌన్ తర్వాత అసలు ప్రేక్షకులు వస్తారో రారో అన్న భయాల నడుమ థియేటర్ లో విడుదలై సంచలన విజయాన్ని అందుకొని కలెక్షన్ల సునామీ కురిపించిన సినిమా ఇదీ.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు రాసిన ఈ డిఫెరెంట్ ప్రేమకథ యూత్ ను మెప్పించింది. దారుణమైన నిజాన్ని సున్నితంగా చెప్పిన ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు హిట్ కొట్టించాడు. ఉప్పెనకు వసూళ్లు, కలెక్షన్లు బాగా రావడంతో నిర్మాతలు ఖుషీ అయ్యారు. తాజాగా “ఉప్పెన” చిత్ర నిర్మాతలు నవీన్ […]

Written By: NARESH, Updated On : March 25, 2021 10:31 pm
Follow us on

ఉప్పెన.. కరోనా లాక్ డౌన్ తర్వాత అసలు ప్రేక్షకులు వస్తారో రారో అన్న భయాల నడుమ థియేటర్ లో విడుదలై సంచలన విజయాన్ని అందుకొని కలెక్షన్ల సునామీ కురిపించిన సినిమా ఇదీ.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు రాసిన ఈ డిఫెరెంట్ ప్రేమకథ యూత్ ను మెప్పించింది. దారుణమైన నిజాన్ని సున్నితంగా చెప్పిన ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు హిట్ కొట్టించాడు.

ఉప్పెనకు వసూళ్లు, కలెక్షన్లు బాగా రావడంతో నిర్మాతలు ఖుషీ అయ్యారు. తాజాగా “ఉప్పెన” చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని మరియు రవిశంకర్ యెలెమంచిలిలు ఇద్దరూ కలిసి దర్శకుడు బుచి బాబు సనాకు ఒక లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సిని బహుమతిగా ఇచ్చారు, దీని  హైదరాబాద్‌ ఎక్స్ షోరూం  ధర రూ .75 లక్షలుగా ఉంది..

ఇలాంటి కార్లు నిజానికి చాలా మంది సంపన్న ప్రజలు, స్టార్ నటీనటులకు  మాత్రమే ఉంటుంది. ఇప్పుడిది ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బుచ్చిబాబు సొంతమైంది. ఈ కారుకు ఫాన్సీ డ్రీం వెహికల్ గా పేరుంది.. “ఉప్పెన” చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్లు చేసింది. కోవిడ్ భయాల మధ్య కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది.. టాలీవుడ్ లో ఒక ట్రెండ్ అయ్యింది. ఈ చిత్రం ద్వారా నిర్మాతలకు భారీగా లాభాలు రావడంతో వారు తాజాగా దర్శకుడు బుచ్చిబాబుకు అందులోంచి బహుమతిగా ఒక లగ్జరీ బెంజ్ కారును  బహుమతి ఇచ్చారు.

ఇలా టాలీవుడ్ లో గ్రాండ్ హిట్ ఇచ్చి బహుమతులు అదుకున్న దర్శకుల్లో కొరటాల శివ (శ్రీమంతుడు), అజయ్ భూపతి (ఆర్‌ఎక్స్ 100), వెంకీ (భీష్మా), మారుతి (ప్రతి రోజు పాండుగే) ఉన్నారు. ఇప్పుడు ఆ దర్శకుల జాబితాలో బుచ్చిబాబు సనా చేరారు.