https://oktelugu.com/

‘మర్మాణువు’తో రాజశేఖర్ ఏం చేయబోతున్నాడు?

యూత్ డైరెక్టర్లలో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు తీసే దర్శకుడు వెంకటేశ్ మహా. కేరాఫ్ కంచరపాలెంతో తొలి మిట్ కొట్టి అనంతరం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అంటూ డిఫెరెంట్ మూవీని తీశాడు. ఇప్పుడు సీనియర్ హీరో రాజశేఖర్ తో కలిసి ‘మర్మాణువు’ అనే డిఫెరెంట్ సినిమాను రూపొందిస్తున్నాడు. వెంకటేశ్ మహా అద్భుతమైన కథ చెప్పడంతోపాటు కత్తిలాంటి సినిమా టైటిల్ ‘మర్మాణువు’ చెప్పాడని.. ఇది ఎంతో నచ్చి తామే సినిమా నిర్మిస్తున్నామని రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక తెలిపారు. అన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : March 25, 2021 / 10:19 PM IST
    Follow us on

    యూత్ డైరెక్టర్లలో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు తీసే దర్శకుడు వెంకటేశ్ మహా. కేరాఫ్ కంచరపాలెంతో తొలి మిట్ కొట్టి అనంతరం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అంటూ డిఫెరెంట్ మూవీని తీశాడు. ఇప్పుడు సీనియర్ హీరో రాజశేఖర్ తో కలిసి ‘మర్మాణువు’ అనే డిఫెరెంట్ సినిమాను రూపొందిస్తున్నాడు.

    వెంకటేశ్ మహా అద్భుతమైన కథ చెప్పడంతోపాటు కత్తిలాంటి సినిమా టైటిల్ ‘మర్మాణువు’ చెప్పాడని.. ఇది ఎంతో నచ్చి తామే సినిమా నిర్మిస్తున్నామని రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక తెలిపారు. అన్ని భాషల్లోనూ మెప్పించే కథ ఇదీ అని త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుఫుల వివరాలతో పాటు షూటింగ్ ఎప్పుడో చెబుతామన్నారు.

    రాజశేఖర్ ప్రస్తుతం ‘శేఖర్’ అనే రిమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ‘మర్మాణువు’లో నటించనున్నారు.

    ఈ సందర్భంగా విడుదల చేసిన మర్మాణువు పోస్టర్ గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. ఒక పుర్రెకు మెజిషియన్ బొమ్మను తగిలించి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ పోస్టర్ చూస్తేనే కథ డిఫెరెంట్ గా ఉందని తెలుస్తోంది.