https://oktelugu.com/

‘రంగ్ దే’ రివ్యూ .. హిట్టా ఫట్టా?

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో వరుస సినిమాలో యంగ్ హీరో నితిన్ సందడి చేస్తున్నాడు. ఇటీవలే ‘చెక్’ సినిమాతో నిరాశపరిచిన ఈ హీరో ఈరోజు ‘రంగ్ దే’ అంటూ ఓ ప్రేమకథ.. పెళ్లయిన తర్వాత కష్టాలతో మనముందు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో ప్రివ్యూలు పడ్డాయి. రివ్యూలు బయటకొచ్చాయి.  వెంకీ అట్లూరి దర్శకత్వం చేసిన ‘రంగ్ దే’ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. హోళీ శుభాకాంక్షలతో ఆ సినిమా  విడుదలైంది. ఈ […]

Written By: , Updated On : March 26, 2021 / 09:10 AM IST
Follow us on

YouTube video player

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో వరుస సినిమాలో యంగ్ హీరో నితిన్ సందడి చేస్తున్నాడు. ఇటీవలే ‘చెక్’ సినిమాతో నిరాశపరిచిన ఈ హీరో ఈరోజు ‘రంగ్ దే’ అంటూ ఓ ప్రేమకథ.. పెళ్లయిన తర్వాత కష్టాలతో మనముందు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో ప్రివ్యూలు పడ్డాయి. రివ్యూలు బయటకొచ్చాయి.  వెంకీ అట్లూరి దర్శకత్వం చేసిన ‘రంగ్ దే’ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. హోళీ శుభాకాంక్షలతో ఆ సినిమా  విడుదలైంది. ఈ సినిమాలో జాతీయ అవార్డు విన్నర్ కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాలతో థియేటర్లో సందడి చేస్తున్న ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

Also Read: రూ.75 లక్షల బహుమతి అందుకున్న ‘ఉప్పెన’ డైరెక్టర్

నటీ నటులు:

నితిన్, కీర్తి సురేశ్, నరేశ్, కౌసల్య, రోహిని, సుహాస్, సత్యం రాజేశ్, అభినవ్ గోమటం, గాయత్రి రఘురాం

కథ:
ఒక లక్ష్యం అంటూ లేని కుర్రాడు నితిన్ ప్రేమకథనే ఈ సినిమా. ఎంతో చలాకీగా ఉంటూ ఆయన అందరినీ ఆటపట్టిస్తుంటాడు. అతని ఇంటిపక్కన ఉండే అమ్మాయి కీర్తి సురేశ్. వీళ్లిద్దరి మధ్య నిత్యం పోరు ఉంటుంది. వీరిద్దరి మధ్య గొడవలు ముదరడంతో నితిన్ పై అతని తండ్రి నరేశ్కి  ఆ అమ్మాయి కొన్ని కల్పించుకుని చెబుతూ  ఉంటుంది. దీంతో నితిన్ కు ఆ అమ్మాయి పై మరింతగా ద్వేషం పెరుగుతుంది. ఓ వైపు గొడవపడుతున్నా మరోవైపు ఆ అమ్మాయికి కుర్రాడు అవసరమైన సాయం చేస్తుంటాడు. ఓసారి అనుకోకుండా ఇద్దరూ లైంగికంగా   కలుసుకుంటారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు వీరిద్దరిని హౌజ్ అరెస్టు చేస్తారు. అయితే ఆ తరువాత పెళ్లి చేస్తారు. పెళ్లి తరువాత వీరిద్దరి మధ్య ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి.. ఆ కథ ఎటువంటి మలుపులు తిరిగిందనేది నవ్వించే కథ..

కథనం:
హీరో, హీరోయిన్ల మధ్య గొడవలు ఆ తరువాత ప్రేమ చిగురించడం లాంటి సినిమాలు ఇదివరకు వచ్చినవే అయినా దర్శకుడు కొత్త పంథాలో చూపించాడు.. అయితే ఈ సినిమాలో హృదయాన్ని తాకే మన జీవితంలో అలుముకున్న కొన్ని సీన్స్ అకట్టుకుంటాయి. అంతేకాకుండా ఈ సినిమాకు ప్రధాన హైలెట్ కామెడీ. నితిన్ చేసే కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే మిగతా సినిమాల్లో లాగే కొన్ని కామన్ సీన్స్ బోరు కొట్టిచ్చేస్తాయి. అయితే దర్శకుడు ఇందులో కీర్తీ సురేశ్ ను కొత్తగా చూపించడం అందరికీ నచ్చుతుంది.. చాలా రోజుల తరువాత కాలేజీ కుర్రాళ్ల మధ్య ప్రేమ సినిమాను మనం తెరపై చూస్తాం.

ఎవరెలా చేశారంటే..?
ఈ సినిమాలో నితిన్ కామెడీ పండించి ఆహ్లాదరకంగా నటించాడు.. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాల స్టైల్లో తన ఫర్ఫామెన్స్ ను చూపిస్తాడు. సత్యం రాజేశ్ లాంటి కమెడిన్ ఉన్నా నితిన్ కామెడీ బాగా ఆకట్టుకుంటుంది. ఇక కీర్తి సురేశ్ ఇందులో అందాలు ఆరబోసిందనే చెప్పవచ్చు. తెలుగులో ఆమె ఇలా నటించడం ఇలాంటి పాత్ర చేయడం తొలిసారియే. ఇంత చలాకీగా ఆమెను చూస్తే ఉత్సాహం వస్తుంది. ఎప్పటిలాగే నరేశ్ తండ్రి పాత్రలో  ఉత్సాహంగా కామెడీ పండించాడు.   ఇక మిగతా నటులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

Also Read: ‘మర్మాణువు’తో రాజశేఖర్ ఏం చేయబోతున్నాడు?

సాంకేతిక వర్గం ఎలా ఉందంటే..?
దర్శకుడు వెంకీ అట్లూరి కథను పాతదే తీసుకున్నా ఇద్దరు స్టార్ నటులను యుక్త వయసులో చూపించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. ముఖ్యంగా జాతీయ నటి కీర్తి సురేశ్ ను నమ్ముకొని ఈ సినిమా కథను రాసినట్టు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలు పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇతర సినిమాల్లో హల్ చల్ సృష్టించే దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో కాస్త హాడావుడి చేయలేదని తెలుస్తుంది. ప్రొడ్యూసర్ నాగ వంశీ భారీ తారగణంతో సినిమా చేసి విలువలను చూపించాడు. మొత్తంగా సినిమా భారీ స్థాయిలో కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే నార్మల్ సినిమాగా ఉందని చెప్పవచ్చు.

ఓకేతెలుగు.కామ్ రేటింగ్ :2.5/5

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

YouTube video player