ఎవ్వరికీ తెలియని ఎన్టీఆర్ ఘనతలు !

తెలుగు తెర పై పురాణ పాత్రలకు జీవం పోసిన వాళ్ళల్లో అగ్రగణ్యుడు అగ్ర హీరో ఎన్టీఆర్. చాలామందికి ఎన్టీఆర్ లోని వైవిధ్యమైన కోణాలు అర్ధమయ్యేవి కావు అట. కుటుంబ సభ్యులకు కూడా ఆయనలోని విభిన్న శైలి అర్ధం అయ్యేది కాదట. మరి అలాంటి ఎన్టీఆర్ గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలుస్తోంది ? తెలిసినా.. ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటూనే ఉంటుంది. కాగా ఆయన గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను విశేషాలను తెలియజేసే క్రమంలో భాగంగా.. […]

Written By: Raghava Rao Gara, Updated On : March 23, 2021 6:28 pm
Follow us on


తెలుగు తెర పై పురాణ పాత్రలకు జీవం పోసిన వాళ్ళల్లో అగ్రగణ్యుడు అగ్ర హీరో ఎన్టీఆర్. చాలామందికి ఎన్టీఆర్ లోని వైవిధ్యమైన కోణాలు అర్ధమయ్యేవి కావు అట. కుటుంబ సభ్యులకు కూడా ఆయనలోని విభిన్న శైలి అర్ధం అయ్యేది కాదట. మరి అలాంటి ఎన్టీఆర్ గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలుస్తోంది ? తెలిసినా.. ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటూనే ఉంటుంది. కాగా ఆయన గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను విశేషాలను తెలియజేసే క్రమంలో భాగంగా.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారనే విషయం చాలామందికి తెలియదు. ఎన్టీఆర్, ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర నృత్యం నేర్చుకోవడానికి.. ఆ వయసులో కూడా ఎన్టీఆర్ స్టూడెంట్ లానే వెళ్లి డ్యాన్స్ నేర్చుకున్నారు. యంగ్ హీరోలకు పోటీ ఇవ్వాలంటే.. తానూ అప్ డేట్ అవ్వాలి అని భావించిన ఎన్టీఆర్.. అలా డ్యాన్స్ నేర్చుకుని.. అభిమానులను అలరించారు.

ఇక ఎన్టీఆర్ ను అప్పటి ప్రజలు దేవుడిగానే భావించే వారు. అందుకే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక, ప్రజల కోసం వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి.. ఎవ్వరూ చేయలేని విధంగా సేవ చేశారు. అందులో భాగంగా
దేవాలయాలలో పూజారి వృత్తికి మొదటిసారి బ్రాహ్మణేతరులకు కూడా అవకాశం వచ్చేలా పరీక్ష ద్వారా పదవులను భర్తీ చేయించిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం అయింది.

ఇప్పుడు మన హైదరాబాద్ గురించి చెప్పుకునే క్రమంలో ట్యాంక్ బండ్ పై బుద్ధుడి విగ్రహాం గురించి మాట్లాడకుండా ఉండలేం. మరి ఆ
బుద్ధుడి విగ్రహాన్ని చెక్కించింది ఎన్టీఆరే అని అందరికీ తెలుసు. అయితే ఎన్టీఆర్ కి ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా ? ఎన్టీఆర్ ఒకసారి న్యూ యార్క్ వెళ్లినప్పుడు అక్కడి స్టాట్యూ అఫ్ లిబర్టీని చూసి మైమరచిపోయారట. అలాంటి విగ్రహం హైదరాబాద్‌లో కూడా ఉంటే.. బాగుంటుందని ఎన్టీఆర్ భావించారు. అందుకే ట్యాంక్ బండ్ దగ్గర బుద్ధుడి విగ్రహాన్ని పెట్టించారు.

ఇక ఎన్టీఆర్ లోని పట్టుదల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాలోని ఒక సీన్ ని కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు పట్టుబట్టింది. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ సీన్ తీయడానికి ఇష్టపడలేదు. అందుకే ఏకంగా కోర్టుకు వెళ్లి మరీ మూడు ఏళ్ళ తరువాత కేసు గెలిచి.. అప్పుడు ఆ సినిమాను విడుదల చేసుకున్నారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.