డీహైడ్రేషన్ తో బాధ పడుతున్నారా.. చెక్ పెట్టే చిట్కాలివే..?

ఇతర కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో చాలామందిని డీహైడ్రేషన్ సమస్య వేధిస్తుంది. వేసవి కాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. వేసవికాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే నూనె, కారం, మసాలా పదార్థాలను వంటలలో తగ్గిస్తే మంచిది. Also Read: ఉదయం మొలకెత్తిన గింజలు తింటే కలిగే లాభాలివే..? కారం, మసాలా, నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారిలో శరీరంలోని […]

Written By: Kusuma Aggunna, Updated On : March 24, 2021 11:35 am
Follow us on

ఇతర కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో చాలామందిని డీహైడ్రేషన్ సమస్య వేధిస్తుంది. వేసవి కాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. వేసవికాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే నూనె, కారం, మసాలా పదార్థాలను వంటలలో తగ్గిస్తే మంచిది.

Also Read: ఉదయం మొలకెత్తిన గింజలు తింటే కలిగే లాభాలివే..?

కారం, మసాలా, నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారిలో శరీరంలోని నీరంతా ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల కొన్ని సందర్భాల్లో వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మద్యపానం కూడా డీహైడ్రేషన్ బారిన పడటానికి కారణమవుతుంది. ఎవరైతే ఆల్కహాల్ ను ఎక్కువగా సేవిస్తారో వారి శరీరం తక్కువ సమయంలోనే డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు ఉంటాయి.

Also Read: మాంసాహారం తిన్న తర్వాత బాదం తింటే కలిగే లాభాలివే..?

మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వేసవికాలంలో మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డీహైడ్రేషన్‌ కు చెక్ పెట్టేవాటిలో నీళ్లు కూడా ఒకటి కాగా దాహం వేసినా, వేయకపోయినా రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీటిని తాగడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువగా ఉండే నిమ్మరసం తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చు. నిమ్మరసం శరీరంలోని అనవసరమైన కొవ్వులను తగ్గించడంలో తోడ్పడుతుంది. టేబుల్‌ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పటిక బెల్లం మిశ్రమం తీసుకుని రాత్రంతా నానబెట్టి ఉదయం తాగినా మంచి ఫలితాలు ఉంటాయి.