Comedy Stars Promo: అందరికి సుపరిచితమయిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో నే కాదు దానిలో ఉండే టీం సభ్యులు కూడా అంతే సుపరిచితం. అలా జబర్దస్త్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ అవినాష్… తన చిన్ననాటి స్నేహితురాలైన తనుజాని పెద్దల సమక్షంలో వివాహమాడాడు.
ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కామెడీ షో వస్తుండగా… దానికి ధీటుగా స్టార్ మా ఛానల్‌లో కమెడీ స్టార్స్ అనే కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుంటే యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తోంది.
ఈ కామెడీ స్టార్స్ కార్యక్రమంలో ముఖ్యమైన విశేషమేమిటంటే… ప్రముఖ టీవీ ఛానెళ్లలో కామెడీ షోస్ లలో కంటెస్టెంట్స్ గా వెళ్లిన ప్రతి ఒక్క కమెడియన్, ఈ షో ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి తమ స్కిట్ల ద్వారా ప్రేక్షకులని అలరిస్తున్నారు.
బిగ్ బాస్ వలన ఎంతో ఫేమ్ వచ్చిన అవినాష్ ఈ రియాలిటీ షో కోసం ఏకంగా జబర్దస్త్ షో నే వదిలేయాల్సి వచ్చింది. అయితే రీసెంట్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో లో కనిపిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు అవినాష్. అయితే ఈ మధ్యనే పుష్పకవిమానం సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమాని బేస్ చేసుకుని అవినాష్ స్పూఫ్ చేసాడు. ఆ స్కిట్ లో.. ఈ మధ్యనే పెళ్లి అయిన అవినాష్ జంప్ అయ్యినట్లుగా కామెడీ తరహాలో స్కిట్ ని చేసి అలరించినట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో తెలుస్తుంది.