నేను ఒంటరి వాడనంటూ షన్ను కంటతడి, బాత్రూం లో ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చిన సిరి (Bigg Boss 5 Telugu Promo): అన్ని ఎమోషన్స్ సమూహారమే బిగ్ బాస్. ఎందుకు కొట్టుకుంటారో, ఎందుకు తిట్టుకుంటుకుంటారో ఎవ్వరికి తెలియదు. బిగ్ బాస్ ప్రయాణంలో రోజులు గడిచే కొద్దీ ఎమోషన్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళని వదిలేసి, బయట ప్రపంచానికి దూరముగా ఉండటం అంటే చాలా పెద్ద సాహసమే. అటువంటి గేమ్ షో లో ఎమోషన్స్ కి ఎలాంటి హద్దులు ఉండవు.
ఈ నేపథ్యం లో సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియ చినిగి చాట అయ్యింది. చాలా వాడి వేడిగా జరిగిన నామినేషన్ల ప్రక్రియలో కెప్టెన్ రవి మినహాయించి మిగతా ఎనిమిది మంది (సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్, అని మాస్టర్, ప్రియాంక సింగ్, మానస్ నాగుల పల్లి, వీజే సన్నీ, ఆర్ జే కాజల్, శ్రీరామ చంద్ర) హౌస్ మేట్స్ అందరూ నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఈ క్రమం లో ఏమైందో తెలియదు కానీ సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో బాగా హర్ట్ అయ్యినట్లు ఉన్నాడు షణ్ముఖ్ జస్వంత్. వాష్రూమ్ లో కూర్చున్న షన్ను… నాకు ఎందుకో లోన్లీ గా అనిపిస్తుంది అని సిరి తో అంటూ బాధ పడుతూ ఉంటాడు.ఈ క్రమం లోనే షన్ను, సిరి కి ఏదో విషయం దగ్గర గొడవ అయ్యినట్లు ఉంది. నువ్వు నాకు వద్దు అని కూడా నోరు జారుతాడు. దీనికి బాగా హర్ట్ అయిన సిరి బాత్ రూమ్ లోకి వెళ్లి ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చినట్లు తాజాగా బిగ్ బాస్ విడుదల చేసిన ప్రోమో లో కనిపిస్తుంది.