Tiger Nageswara Rao: ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్ పురానికి చెందిన వ్యక్తి ‘టైగర్ నాగేశ్వరరావు’. మాస్ మహరాజ్ రవితేజ చేస్తున్న పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లలో ఈ సినిమా కూడా ఒకటి. అన్నట్టు ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి బిలౌవ్ ఏవరేజ్ సినిమాలు తీసిన డైరెక్టర్ ‘వంశీకృష్ణ’ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ ‘టైగర్ నాగేశ్వర్రావు’ సినిమాలో కోలీవుడ్ స్టార్ నటుడు విష్ణు విశాల్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Also Read: ఆరంభమే సరిగాలేదు.. 2022 పై సన్నగిల్లుతున్న ఆశలు !
రీసెంట్ గా వీరి ఫోటో కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాలో విష్ణు విశాల్ ఉన్నాడో లేదో చూడాలి. ఇక 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వరరావు నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. మరి అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో రవితేజ హీరోగా ఎలా నటిస్తాడో చూడాలి. ఏది ఏమైనా
టైగర్ నాగేశ్వరరావు విషయాలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
అందుకే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఈ బయోపిక్ లో రవితేజ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.అయితే పాయల్ రాజ్ ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించనుందని, పాయల్ క్యారెక్టర్ బోల్డ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నాడు.
Also Read: ‘పుష్ప’ కొత్త సీన్లు.. ఇక ‘ఊ’ అనాల్సిందే !