YS Jagan And KCR: వైయస్ జగన్మోహన్ రెడ్డికి ( Y S Jagan Mohan Reddy ) రాజకీయ మిత్రుడు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు కెసిఆర్. చంద్రబాబుకు కేసిఆర్ శత్రువు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మిత్రుడు గా మారారు. ఆ ఇద్దరి మధ్య స్నేహం పతాకస్థాయిలో ఉంది. అయితే ఇద్దరూ అధికారంలో ఉన్నప్పుడు స్నేహంగా మెలిగారు. ఓటమి తర్వాత కూడా వారి స్నేహం అలానే కొనసాగుతోంది. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలోకి రావాలని పరస్పరం కోరుకుంటున్నారు. ఒకరి శత్రువులను మరొకరు ద్వేషిస్తున్నారు. ఒకరి మిత్రులను ఒకరు అభిమానిస్తున్నారు. ఇది చాలా విషయాల్లో జరుగుతోంది కూడా. సమకాలీన రాజకీయ అంశాలపై వారి స్పందన కూడా అలానే ఉంది. అందులో కూడా ఒకరి ప్రయోజనాలు ఒకరివి దాగి ఉన్నాయి.
Also Read: జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా వజ్రాయుధం.. బంతి పడితే వికెటే!
* యుద్ధం పై స్పందన ఏది?
పశ్చిమ ఆసియాలో( West Asia ) యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయిల్,ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయిల్ కు అమెరికా మద్దతు తెలుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై దేశంలో అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని.. డోనాల్డ్ ట్రంప్ విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తూ.. చాకచక్యంగా వ్యవహరిస్తున్నారంటూ మెచ్చుకున్నారు. అయితే ఇంతవరకు దీనిపై ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక్క కామెంట్ కూడా చేయలేదు. జాతీయ భావాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కెసిఆర్ కూడా మాట్లాడలేదు. బహుశా ఆయన మాట్లాడకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని అర్థమవుతోంది.
* పశ్చిమ బెంగాల్ వివాదంపై..
తాజాగా పశ్చిమబెంగాల్( West Bengal ) పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వలేదు. ప్రోటోకాల్ కూడా పాటించలేదు. దీనిపై రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. రాష్ట్రపతి వంటి అత్యున్నతమైన వ్యక్తికి సముచిత గౌరవ మర్యాదలు ఇవ్వడం అందరి బాధ్యత అని అభిప్రాయపడ్డారు. కానీ ఈ విషయంలో కూడా కెసిఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించలేదు. కెసిఆర్ కు మమతా బెనర్జీ దోస్త్. అదే కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డి దోస్త్. అందుకే ఆ ఇష్యూ పై మాట్లాడలేదు.
మొన్న ఆ మధ్యన ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సు వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. చొక్కాలు విప్పి అర్థనగ్నంగా నిరసనలు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దానిని తప్పు పట్టారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. కెసిఆర్ సైతం దానిని సహించలేదు. అయితే ఇక్కడ కూడా లాజిక్ ఉంది. గులాబీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అందుకే కెసిఆర్ స్పందించారు. ఇటు జగన్మోహన్ రెడ్డి ఖండించారు. పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతికి జరిగిన అవమానం పై మాత్రం ఎటువంటి స్పందన లేదు. తద్వారా కెసిఆర్ లైన్లోనే జగన్ రాజకీయాలు ఉంటాయని స్పష్టమైంది.