TPCC Chief Revanth Reddy: టీపీసీసీ చీఫ్ గా పగ్గాలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి చాలా సార్లు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా హౌస్ అరెస్టులు ఆయన మీద బాగా పెరిగిపోతున్నాయి. ఏదో ఒక విషయం మీద దూకుడుగా మాట్లాడి నిరసనలకు పిలుపునివ్వడం, పోలీసులు వచ్చి ఇల్లు దాటనివ్వకుండా బలవంతంగా హౌస్ అరెస్టులు చేయడం కామన్ అయిపోయింది. అయితే రేవంత్ కూడా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడమే టీఆర్ ఎస్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఇప్పుడు కేసీఆర్ పుట్టిన రోజును టీఆర్ ఎస్ శ్రేణులు ఘనంగా మూడు రోజుల వరకు నిర్వహిస్తోంది. కాగా అటు వ్యవసాయ శాఖ కూడా ఆయన పుట్టిన రోజును రైతు దినోత్సవంగా జరుపుకోవాలంటూ ప్రకటించింది. కాగా రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా.. ఇలా పుట్టిన రోజును మూడు రోజులు జరపాలని నిర్ణయించడం ఏంటంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలంటూ ఈ రోజు పిలుపునిచ్చారు.
దీంతో పోలీసులు అప్రమత్తం అయిపోయారు. ఆయన్ను ఇంటి దగ్గరే హౌస్ అరెస్ట్ చేశారు. కాగా కేసీఆర్ పుట్టిన రోజు మీద రేవంత్ కొన్ని అభ్యంతర కర వివాదాస్పద కామెంట్లు చేయడ వల్లే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలను టీఆర్ ఎస్ నేతలు సీరియస్ గా తీసుకోవడంతో రేవంత్ ను అరెస్ట్ చేసే దాకా రాజకీయం వెళ్లింది. ఇక్కడ ఓ విషయం ఏంటంటే.. రేవంత్ ఇలా ప్రతిదానికీ వివాదం రగిల్చడమే ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది.
Also Read: కేసీఆర్ బర్త్ డే స్పెషల్: 68వ వసంతంలోకి టీఆర్ఎస్ బాస్
ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేయడం ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. నిజంగా ప్రజల సమస్యలపై పోరాడితే అప్పుడు ప్రజల్లో సింపతీ పెరుగుతుంది. కానీ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సింపతీ తెచ్చుకోవాలని చూస్తే మాత్రం తీవ్ర నష్టం తప్పదు. పైగా రేవంత్ అరెస్ట్ ను సీనియర్ నేతలు ఎవరూ పెద్దగా ఖండించలేదు.
కాబట్టి రేవంత్ ఇలా అనవసర కామెంట్లతో అరెస్టులు చేయించుకుని సింపతీ కోసం పాకులాడటం మానాలని రాజకీయ నిపుణులు అంటున్నారు. ప్రజల సమస్యలపై పోరాడితే అదే ఆయనకు గుర్తింపును తీసుకు వస్తుందని, సీనియర్ నేతలు కూడా కలిసి వచ్చేలా చేస్తుందని చెబుతున్నారు. మరి రేవంత్ ఇక మీదట అయినా ఇలాంటి వివాదాస్పద కామెంట్లు మానుతారో లేదో చూడాలి.
Also Read: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం