ఆ 10 రాష్ట్రాలే కరోనా హాట్ స్పాట్స్

దేశంలో 10 రాష్ట్రాలే కరోనా హాట్ స్పాట్స్ గా ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా విజృంభణకు ఆలవాలంగా ఉన్నట్టు తేలింది. గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులు.. రికవరీ అవుతున్న గణాంకాల ప్రకారం ఈ లెక్క తేల్చారు. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 35.16 లక్షలు అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక 75.04శాతం కేసులు పది […]

Written By: NARESH, Updated On : May 17, 2021 5:23 pm
Follow us on

దేశంలో 10 రాష్ట్రాలే కరోనా హాట్ స్పాట్స్ గా ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా విజృంభణకు ఆలవాలంగా ఉన్నట్టు తేలింది. గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులు.. రికవరీ అవుతున్న గణాంకాల ప్రకారం ఈ లెక్క తేల్చారు.

గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 35.16 లక్షలు అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక 75.04శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్టు తెలిపింది.

దేశంలోనే అత్యధిక కరోనా కేసులకు ఆలవాలంగా కర్ణాటక ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప కర్ణాటకలో లాక్ డౌన్ పెట్టేశాడు. మరిన్ని రోజులు అక్కడ లాక్ డౌన్ కొనసాగించడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పటికే కర్ణాటకలో యాక్టివ్ కేసులు ఏకంగా 6 లక్షలు దాటేశాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 4.70 లక్షల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో లాక్ డౌన్ ద్వారా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

ఇక ఆ తర్వాత వరుసగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, చత్తీస్ ఘడ్ రాష్ట్ాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా మొన్నటివరకు 20శాతానికి పైగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతానికి 18.17శాతానికి తగ్గింది. ఇక మరణాల రేటు కూడా 1.10 శాతంగా ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు విడుదల చేసింది. దేశంలోనే కర్ణాటకలో అత్యధిక పాజిటివిటీ రేటు 20శాతంగా ఉంది.