
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.. మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా. టాప్ హీరోలతో కలిసి నటించింది. అయితే.. కొంత కాలంగా అమ్మడి కెరీర్ గ్రాఫ్ కాస్త డౌన్ అవుతూ వచ్చింది. కొత్త బ్యూటీస్ ఇంపోర్ట్ కావడంతో.. రేసులో వెనుకబడింది. ప్రస్తుతం ఎఫ్-3 వంటి సినిమాల్లో నటిస్తోంది. కాగా.. ఈ బ్యూటీ తొలిసారిగా ఓటీటీ ప్లాట్ ఫాంలోకి అడుగు పెడుతోంది.
గరుడవేగతో రాజశేఖర్ కు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న మూవీలో తమన్నా.. లీడ్ రోల్ లో నటిస్తోంది. ‘11వ గంట’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానుంది. తెలుగు ఓటీటీ ఆహాలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఈ చిత్రంలో కార్పొరేట్ ఇండస్ట్రీని నడిపిస్తున్న లేడీ బాస్ గా మిల్కీ బ్యూటీ కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించనుందని సమాచారం. అయితే.. తన డెబ్యూ మూవీకి రెమ్యునరేషన్ గట్టిగానే డిమాండ్ చేసిందట తమన్నా. ఏకంగా రూ.2 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫిల్మ్ సర్కిల్స్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి.
ఈ భారీ పారితోషికంతోనే ఓటీటీలోకి రావడానికి తమన్నా అంగీకరించిందని తెలుస్తోంది. ఈ సినిమాలో తమన్నాతోపాటు మరికొందరు స్టార్లు కూడా నటించనున్నట్టు సమాచారం. మరి, ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్