తన తండ్రి హత్య జరిగి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతోందని, అయినా.. నిందితులను పట్టుకోలేదంటూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చాలా విషయాలు వెల్లడించారు.
తన తండ్రి హత్య గురించి వదిలేయాలని తనకు చాలా మంది సలమా ఇచ్చారని చెప్పారు. కానీ.. తన మనసు మాత్రం న్యాయం కోసం పోరాడాలని చెబుతోందని అన్నారు. తన తండ్రి గత ముఖ్యమంత్రికి సోదరుడని, ఇప్పటికి ముఖ్యమంత్రి బాబాయి అని అన్నారు. తన తండ్రి హత్య కేసు విచారణ మాత్రం సరిగా జరగడం లేదని ఆరోపించారు.
తనకే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తాను న్యాయం కోసం ఇంకా ఎంత కాలం వేచి చూడాలని ప్రశ్నించారు. అన్యాయంపై తాను చేస్తున్న పోరాటంలో తనకు అందరూ సహకరించాలని కోరారు. తన తండ్రి హత్య గురించి కొందరు అధికారులను కలిస్తే.. కడప ప్రాంతంలో హత్యలు సహజం అని మాట్లాడరని చెప్పారు.
హత్య జరగడం సాధారంణ ఎలా అవుతుందో తనకు తెలియట్లేదన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే.. హత్య కేసులో సాక్షులకు హాని జరుగతుందేమోనని భయమేస్తోందన్నారు సునీత. తన తండ్రికి శత్రువులు ఎవరూ లేరని, ఆర్థిక కారణాలతోనూ హత్య జరిగిందని తాను అనుకోవడం లేదన్న సునీత.. ఇది కేవలం రాజకీయ హత్యగా తాను భావిస్తున్నట్టు చెప్పారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్