Homeప్రత్యేకంప్రేమలో పడిన సీనియర్ నటి !

ప్రేమలో పడిన సీనియర్ నటి !

 

ఆమె తెలుగు చిత్ర సీమలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అలాగే, తమిళ మలయాళ సినిమాలు కూడా చేసింది. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఆమె, ఈ మధ్యే 48వ పుట్టినరోజును కూడా జరుపుకుంది. ఐతే, నలభై ఎనిమిదేళ్లు వచ్చాక గానీ, ఆమెకు ఒంటరితనం బాధ అర్ధం కాలేదు. ఆ ఒంటరి తనాన్ని భరించలేక లేటు వయసులో ప్రేమలో పడింది.

అయినా, ప్రేమకి అనుబంధానికి వయసుతో సంబంధం ఏమి ఉంటుంది అనుకుందో ఏమో గానీ, తన మనసుకు నచ్చిన ఓ వ్యక్తి ప్రేమలో ఆమె ప్రస్తుతం సేద తీరుతుంది. వయసు పెరుగుతున్న క్రమంలో ఓ తోడు అనేది మనిషికి అవసరం. అందుకే, ఏ వయసులోని వారు అయినా తనకంటూ ఓ తోడు ఉండాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కాబట్టి, ఈ సీనియర్ నటి చేసింది అసలు తప్పే కాదు అని ఆమె సన్నిహితులు కూడా ఆమెకు బాసటగా నిలిచారు.

ఇంతకీ ఈ సీనియర్ నటి ప్రేమలో పడింది ఎవరితో అంటే.. ఓ వ్యాపారివేత్తతో. గతంలో కొన్ని సినిమాలకు ఫైనాన్స్ కూడా చేశాడు ఆయన. బహుశా ఆ సమయంలోనే ఈ సీనియర్ నటి పరిచయం అయి ఉంటుంది. ఆ పరిచయం కాస్త, ఆమెకు ఒంటరి తనాన్ని పోగొట్టే వరకు వచ్చింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. అయితే ఈ వ్యాపారవేత్తకు ఆల్ రెడీ పెళ్లి అయింది. పిల్లలు కూడా ఉన్నారు.

అందుకే దైర్యంగా పెళ్లి చేసుకోలేకపోతున్నారు. పెళ్లి చేసుకోకపోయినా, ఆ సీనియర్ నటితో సన్నిహిత స్నేహ బంధాని నెరపుతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ విషయం గురించే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ సీనియర్ నటి ఎవరేంటే.. ఆమె గతంలో హీరో నానికి తల్లి పాత్రలో నటించింది. మంచి ఎంటర్ టైన్మెంట్ తో సాగే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో నానికి చిన్న లోపం ఉంటుంది. ఆ లోపం మీదే సినిమా మొత్తం నడుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఆరు సినిమాలు వరకూ ఉన్నాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version