గ్లోబల్ టెండర్స్: ఏపీకి టీకాలకు నో.. ఇతర రాష్ర్టాలకు ఓకే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీకాల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది. ప్రి బిడ్ సమావేశానికి రెండు కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. కానీ ఒక్క కంపెనీ కూడా బిడ్ దాఖలు చేయలేదు. ప్రి బిడ్ భేటీకి వచ్చారంటే వారికి టీకాలు సరఫరా చేసే ఉద్దేశం లేనట్లే. తొమ్మిది రాష్ర్టాలు గ్లోబల్ టెండర్లు పిలిస్తే ఒక్క ఏపీకి మాత్రమే ఒక్క టెండర్ దాఖలు కాలేదు. మిగిలిన రాష్ర్టాలకు స్పందన వచ్చింది. చివరికి తెలంగాణకు కూడా రెండు కంపెనీలు టెండర్లు దాఖలు […]

Written By: Srinivas, Updated On : June 4, 2021 1:32 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీకాల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది. ప్రి బిడ్ సమావేశానికి రెండు కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. కానీ ఒక్క కంపెనీ కూడా బిడ్ దాఖలు చేయలేదు. ప్రి బిడ్ భేటీకి వచ్చారంటే వారికి టీకాలు సరఫరా చేసే ఉద్దేశం లేనట్లే. తొమ్మిది రాష్ర్టాలు గ్లోబల్ టెండర్లు పిలిస్తే ఒక్క ఏపీకి మాత్రమే ఒక్క టెండర్ దాఖలు కాలేదు. మిగిలిన రాష్ర్టాలకు స్పందన వచ్చింది. చివరికి తెలంగాణకు కూడా రెండు కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. మహారాష్ర్టకు 8 కంపెనీలు స్పందించాయి.

నాలుగు కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కోటి డోసుల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది. కొన్ని అంతర్జాతీయ సంస్థలు స్పందించాయి. అస్ర్టా జెనెకా, స్పుత్నిక్ తయారీదారులు టెండర్లు వేశారు.

ప్రపంచ వ్యాప్తంగా 17 కంపెనీలకు పైగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుంటే కేవలం రండు మూడు కంపెనీలు మాత్రమే గ్లోబల్ టెండర్లలో పాల్గొంటున్నాయి. సీఎం కేసీఆర్ నురుగా రంగంలోకి దిగి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన కంపెనీలు గ్లోబల్ టెండర్లలో పాల్గొనే విధంగా ప్రచారం కల్పించారు.

తమిళనాడు ప్రభుత్వం చైనా వ్యాక్సిన్ల సరఫరాకు అంగీకారం తెలిపింది. మహారాష్ర్టతో పాటు పలు రాష్ర్టాల గ్లోబల్ టెండర్లకు పలు సంస్థలు ఆసక్తి చూపాయి. వాటి నుంచి ఆయా రాష్ర్టాలు కొనుగోలు చేస్తాయో లేదో వాటికి కేంద్రం అనుమతి ఇస్తుందా అన్నది తేలాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో తమకు స్పందన రాలేదు. ఇతర రాష్ర్టాలు రాలేదన్నట్లు రాయడం ఆశ్చర్యకరంగా ఉంది.