Minister Roja: బుల్లితెరపై కొన్నాళ్లుగా ‘జబర్దస్త్’ షో హవా కొనసాగిస్తోంది. ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తుండటంతో జబర్దస్త్ షో నిర్వాహాకులకు కాసులవర్షం కురిపిస్తోంది. ఈ షోలో అవకాశం దక్కించుకున్న కామెడీయన్లు, యాంకర్లు ప్రస్తుతం టాలీవుడ్లో మంచి అవకాశాలు దక్కించుకొని రెండుచేతుల సంపాదించుకుంటున్నారు.

జబర్దస్త్ బుల్లితెరపై బిగ్ హిట్ కావడంతో నిర్వాహాకులు ఇదే కాన్సెప్ట్ తో ఎక్స్ ట్రా జబర్దస్ ను కూడా తీసుకొచ్చారు. ఈ రెండు షోలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఎంటటైన్మెంట్ చేస్తున్నాయి. ఈ షోకు తొలినాళ్లలో మెగా బ్రదర్ నాగబాబు, హీరోయిన్ రోజా జడ్జీలుగా వ్యవహరించారు. చాలా ఏళ్లు నాగబాబు ఈ షోకు జడ్జిగా పని చేశారు.
అయితే కామెడీయన్ పేమెంట్స్, ఇతరత్ర విబేధాలతో నాగబాబు ఈ షోను తప్పించుకొని వేరుకుంపటి పెట్టుకున్నారు. దీంతో పలువురు కామెడీయన్లు సైతం ఆయన వెంట వెళ్లారు. అయితే నాగబాబు షో పెద్దగా హిట్టు కాకపోవడంతో జబర్దస్త్ హవా కొనసాగింది. ఈక్రమంలోనే నాగబాబు అనేక ప్రయోగాలు చేస్తూ తన షోను జబర్దస్త్ కు ధీటుగా మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
ప్రస్తుతం నాగబాబు జడ్జిగా చేస్తున్న కామెడీ షో జబర్దస్త్ ధీటుగా టీఆర్ఫీ సాధిస్తూ దూసుకెళుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎమ్మెల్యే రోజాకు జగన్ క్యాబినేట్లో మంత్రి పదవీ దక్కడంతో ఆమె జబర్దస్త్ షోకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రభావం జబర్దస్త్ షోపై పడే అవకాశం కన్పిస్తోంది. అయితే రోజా లేకపోతే మాత్రం ఓ కామెడీయన్ జబర్దస్త్ లో రెచ్చిపోయే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది.
జబర్దస్త్ లో పొలిటికల్ స్కిట్స్ చేస్తూ పంచులు వేసే ఓ కామెడీయన్ ను ఇప్పటిదాకా రోజా కొంచెం కట్టడి చేసేవారు. తాజాగా రోజా ఈ షోకు గుడ్ బై చెప్పడంతో పవన్ కల్యాణ్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే సదరు కామెడీయన్ ఇకపై రెచ్చిపోయే అవకాశం కన్పిస్తోంది. గతంలో ‘మా’ అధ్యక్షుడిపై సైతం ఓ స్కిట్ చేసి ఆ కామెడీయన్ నవ్వులు పూయించాడు.
ఇక తనదైన స్టైల్లో యాంకర్లు, జడ్జిలపై సైతం సెటైర్లు వేసేవాడు. తాాజాగా ఈ షో నుంచి ఎమ్మెల్యే రోజా తప్పుకోవడంతో ఇకపై ఆ కామెడీయన్ వేసే పొలిటికల్ డైలాగులు మతాబుల్లా పేలే అవకాశం కన్పిస్తోంది. దీంతో రోజాపై కూడా పంచులు పడే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. మరోవైపు రోజా లేకుండా కామెడీయన్లు ఏమేరకు స్కిట్స్ చేసి అలరిస్తారనే ఆసక్తి బుల్లితెర అభిమానుల్లోనూ నెలకొంది.
[…] Mega Hero: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేసిన సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం కనీస వసూళ్లను కూడా సాధించలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ‘గని’ సినిమాలో మ్యాటర్ లేకపోవడం.. మరోపక్క ఆర్ఆర్ఆర్ పోటీగా ఉండటంతో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. అల్లు బాబీ ‘గని’ సినిమాకి నిర్మాత కావడంతో ఈ సినిమా పై చిన్నపాటి ఆసక్తి కలిగింది. […]
[…] Alia Bhatt Wedding: పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్ ఆమె, అతను బాలీవుడ్ లోనే మోస్ట్ ఫేవరేట్ హీరో… అసలు ఈ స్థాయి హీరో – హీరోయిన్ పెళ్లి అంటే ఎలా ఉండాలి ? ముఖ్యంగా ఆర్భాటాలు, హడావుడి ఏ స్థాయిలో ఉండాలి ? కానీ, చివరకు అలియా – రణబీర్ ల పెళ్లి మాత్రం చాలా సింపుల్ గా జరుగుతుంది. […]