Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan martial arts announcement: ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించబోతున్న పవన్ కళ్యాణ్..? పూర్తి వివరాలు...

Pawan Kalyan martial arts announcement: ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించబోతున్న పవన్ కళ్యాణ్..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

Pawan Kalyan martial arts announcement: గతంలో ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్'(Pawan Kalyan Creative Works) అనే బ్యానర్ ని స్థాపించి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కొన్ని సినిమాలను నిర్మించి భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని తన సొంత బ్యానర్ పైనే నిర్మించాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా అందులో భాగస్వామి. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. 30 కోట్ల రూపాయలకు పైగానే నష్టాలను మిగిలించింది. ఇక ఆ తర్వాత ‘కాటమరాయుడు’ చిత్రాన్ని కూడా తన బ్యానర్ లోనే నిర్మించాడు. ఈ సినిమా ఒక మోస్తరు గా ఆడినప్పటికీ, లాభాలను మాత్రం తెచ్చిపెట్టలేదు. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఇదే ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ మీద నితిన్ ని హీరో గా పెట్టి ‘చల్ మోహన్ రంగ’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది.

Also Read: మొన్న నిధి అగర్వాల్..నిన్న సమంత..నేడు అల్లు స్నేహా..లేడీ సెలబ్రిటీలకు రక్షణ కొరవు!

దీంతో ఈ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ సినిమాలను నిర్మించడం మానేసాడు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీ అవ్వడం తో వృత్తి పరంగా కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా, నిర్మాణ రంగం లో కూడా భాగం అవ్వాలని, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ని రీ యాక్టీవ్ చేసాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో చేతులు కలిపి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో నాలుగు సినిమాలు చేయనున్నాడు. అందులో రెండు సినిమాల్లో ఆయనే హీరో గా నటించనున్నాడు, మరో రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పై ఆయన మరో సరికొత్త ప్రయాణం కూడా మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. నేడు ఆయన తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, ఈ నెల 7న మార్షల్ ఆర్ట్స్ విషయం లో సరికొత్త జర్నీ మొదలు కానుంది అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. టాక్ ఎలా ఉందంటే!

ఇలా చెప్పడం తో ఫ్యాన్స్ అయ్యోమయానికి గురయ్యారు. పవన్ అన్న ఏమి చేయబోతున్నాడు?, ఎల్లుండి ఏమి చెప్పబోతున్నాడు?, ఓజీ సీక్వెల్ ని తన బ్యానర్ లో నిర్మించబోతున్నాను అని ప్రకటన చేయబోతున్నాడా?, లేదా వేరే ప్లాన్ ఏమైనా ఉందా?, అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టీ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఎక్కడ, ఏమిటి అనేది తెలియాలంటే జనవరి 7 వరకు ఆగాల్సిందే. చూడాలి మరి ఈ సర్ప్రైజ్ ఎలా ఉండబోతుంది అనేది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వం లో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా కంటే ముందు, ఆయన హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చ్ నెలలో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular