Yash: మోస్ట్ అవెయిటెడ్ మూవీగా వస్తున్న కేజీఎఫ్-2 మీద ఉన్న అంచనాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆకాశమే హద్దు అన్నట్లు ఎక్కడ చూసినా ఇప్పుడు కేజీఎఫ్-2 గురించే చర్చించుకుంటున్నారు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న సీక్వెల్ మూవీ కూడా ఇదే. అందుకే దాన్ని తెలుగులో కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు.

ఈనెల 14న సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రాకింగ్ స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. వీరు తెలుగులోనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో ప్రెస్ మీట్‌లు పెట్టిన కేజీఎఫ్ టీమ్.. హైదరాబాద్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇదులో యష్ తో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి, టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంటి ప్రముఖులు వచ్చారు.
Also Read: Hari Hara Veera Mallu: 1000 మంది తో పవన్ కళ్యాణ్ భారీ ఫైట్.. ఫాన్స్ కి ఇక పూనకాలే
ఈ సందర్భంగా సినిమా గురించి అనేక విషయాలను రిపోర్టర్లు అడగ్గా.. వాటికి ప్రశాంత్ నీల్, యష్ సమాధానాలు ఇచ్చారు. సినిమా మరో లెవల్లో ఉంటుందని, ఎవరూ ఊహించని ట్విస్టులు ఉన్నాయంటూ అంచనాలను మరింత పెంచేశారు ప్రశాంత్ నీల్. అయితే ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ తెలుగు హీరోతో మల్టీ స్టారర్ సినిమా అవకాశం వస్తే చేస్తారా అని యష్ ను అడిగారు.
దానికి యష్ కూడా ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు. తాను మంచి హీరో వచ్చి మల్టీ స్టారర్ చేయమని కోరితే చేయనని చెప్పేశాడు. అయితే మంచి డైరెక్టర్ వచ్చి ఆ హీరోలతో చేయగలను అనిపిస్తే కచ్చితంగా చేసే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంటే హీరోలను నమ్ముకోకుండా డైరెక్టర్లను నమ్ముకోవాలని యష్ ఇన్ డైరెక్టుగా చెప్పాడన్నమాట.

ఇక ఇదే సమయంలో బాహుబలి గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఈ మూవీ బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందా అని అడగ్గా.. యష్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. కొత్తగా వచ్చే ప్రతి మూవీ కూడా పాత మూవీల రికార్డులను బద్దలు కొట్టాలని అప్పుడే పురోగతి సాధ్యం అవుతుందంటూ తెలిపాడు. ప్రతి మూవీతో కలెక్షన్లు అనేవి మారుతాయని.. ఇప్పుడు కేజీఎఫ్ తో అదే జరగాలని కోరుకుంటున్నట్టు వివరించారు.
Also Read:Jabardast: జబర్దస్త్ షోపై ప్రముఖ కమెడియన్ సెటైర్లు..!