
సినిమా ఇండస్ట్రీ నిండా ప్రస్తుతం కోవిడ్ 19 సెకండ్ వేవ్ కేసులే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సినిమా జనాల్లో ఒక భయం కనిపిస్తోంది. మళ్ళీ లాక్ డౌన్ పెడితే ఏమిటి పరిస్థితి ? షూటింగ్స్ ఆగిపోతే బతుకు నడిచేది ఎలా ? ఇలా అనేక రకాలుగా టెన్షన్ పడుతున్నారు సినిమా జనం. మరోపక్క టాలీవుడ్ లో ఫస్ట్ వేవ్ లో బయటపడ్డ సెలెబ్రిటీలందరూ ప్రసుతం కరోనాకి గురవ్వడం కూడా మేకర్స్ ను భయపెడుతుంది. ఇప్పటికే పలు సినిమాల షూటింగులను కూడా ఆపేశారు, అయితే ఆచార్య షూటింగ్ మాత్రం ఆగట్లేదు. గత వారమే ఈ సినిమా సెట్ లో బ్రహ్మజీకి కరోనా అని తేలినా.. ఈ సినిమా షూట్ ను మాత్రం ఆపలేదు.
ప్రస్తుతం రామ్ చరణ్, పూజ హెగ్డే పై ఒక సాంగ్ ను షూట్ చేస్తున్నారు. కోవిడ్ 19 ప్రొటొకాల్స్ అన్ని పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ ఈ సాంగ్ షూటింగ్ ను చేస్తోన్నట్లు టీమ్ చెబుతుంది. ఇక షూట్ లో పాల్గొనబోయే ముందే రామ్ చరణ్, పూజ హెగ్డేలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తరువాతే వాళ్ళు షూట్ కి వెళ్తున్నారు. ఈ నెల 20 వరకు ఈ సాంగ్ షెడ్యూలు ఉంటుందని.. అయితే, మరో మూడు రోజుల్లో పాట పూర్తవుతుందని, ఆ తరువాత కొన్ని సీన్లను షూట్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ టైంలో షూటింగ్ ఆపితే, సాంగ్ కోసం వేసిన ప్రత్యేక సెట్ వేస్ట్ అయిపోతుందని.. నిర్మాతకు ఎలాంటి నష్టం జరగకూడదు అనే చరణ్ – పూజా ఇద్దరూ కమిటెడ్ గా వర్క్ చేస్తున్నారు.
కానీ, మెగా అభిమానులు మాత్రం ఈ షూట్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. హీరో హీరోయిన్ల ఇద్దరి పై పాట తీస్తున్న దర్శకుడు శివ కొరటాలకు సెన్స్ లేదని మెగా ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సోను సూద్ కి కరోనా వచ్చింది. సోనుసూద్ తో కొరటాల దగ్గరగా మూవ్ అయ్యాడు షూటింగ్ సమయంలో. అయినా కొరటాల అవేమి పట్టించుకోకుండా ఇప్పడు చరణ్ తో సన్నిహితంగా మూవ్ అవుతూ సాంగ్ షూట్ చేయడం ఏమిటీ ? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘చిరంజీవి’ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.