మహేష్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ప్లాన్ చెడింది !

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం రోజురోజుకూ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా, కరోనా సినీ లోకానికి పెద్ద శాపంగా మారింది. కరోనా కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చుకుని.. సైలెంట్ అయిపోయాయి చాల ప్రొడక్షన్ హౌస్ లు. ఇది ఇలాగే జరిగితే.. ఇక ఈ సంవత్సరం కూడా సినిమా ఇండస్ట్రీలకు మనుగడ లేనట్టే. కాగా తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమా టీమ్ కి కూడా కరోనా షాక్ ఇచ్చింది. నిన్నటివరకూ హైదరాబాద్ లో ఈ […]

Written By: admin, Updated On : April 18, 2021 12:51 pm
Follow us on


ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం రోజురోజుకూ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా, కరోనా సినీ లోకానికి పెద్ద శాపంగా మారింది. కరోనా కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చుకుని.. సైలెంట్ అయిపోయాయి చాల ప్రొడక్షన్ హౌస్ లు. ఇది ఇలాగే జరిగితే.. ఇక ఈ సంవత్సరం కూడా సినిమా ఇండస్ట్రీలకు మనుగడ లేనట్టే. కాగా తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమా టీమ్ కి కూడా కరోనా షాక్ ఇచ్చింది. నిన్నటివరకూ హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిపారు.

అలాగే ఈ రోజు కూడా షూటింగ్ మొదలుపెట్టె ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా టీమ్ మెంబర్స్ లో ఆరుగురికి కరోనా సోకింది. దాంతో చేసేదేమి లేక ఇక షూటింగ్ ను తప్పనిసరి పరిస్థితుల్లో నిలిపివేశారు. అలాగే టీంలో మిగిలిన సభ్యులు అందరూ కొన్నాళ్ళూ ఐసోలేషన్ కి వెళ్తున్నారు. ఇప్పుడు మహేష్ కూడా ఐసోలేషన్ లోకి వెళ్ళక తప్పడం లేదు. పాపం ఈ దెబ్బతో మహేష్ ప్లాన్ మొత్తం నాశనం అయింది. నిజానికి మహేష్ బాబు ఈ సినిమాని స్పీడ్ గా పూర్తి చేసి జులై నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు.

ఇప్పుడు జులై లోపు షూటింగ్ పూర్తి చేయడం సాధ్యం కాదు. కాబట్టి.. మరో నాలుగు నెలలు లేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ కరోనా కేసులు షూటింగ్ షెడ్యూల్స్ ని తారుమారు చేయడంతో పాటు.. హెల్త్ సమస్యలు ఉన్న కొంతమంది నటీనటులను కూడా తీవ్రంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. మరి ఎప్పటికి ఈ కరోనా అంతం అవుతుందో గానీ, సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు.

ఒకపక్క దేశంలోని అన్నీ ఇండస్ట్రీలోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. మెయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో గతేడాది కన్నా ఈ సారి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇక కొన్ని సినిమాలు విదేశాలకు వెళ్లి షూటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెకెండ్ వేవ్ తో అది ఇప్పట్లో సాధ్యం కాదు. విదేశాల్లో కూడా కరోనా ఎక్కువగానే ఉంది. మొత్తానికి సర్కారు వారి పాట విదేశీ షూటింగ్ కూడా ఇప్పట్లో మొదలవ్వదు.