వేణు శ్రీరామ్ “ఐకాన్”కల నెరవేర్చబోతున్న కొరటాల!

వేణు శ్రీరామ్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకరిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దిల్ రాజు సినిమాలకు బ్యాక్ బోన్ గా ఉన్న వ్యక్తులలో వేణు శ్రీరామ్ ఒకరు. దిల్ రాజు స్క్రిప్ట్ విషయంలో స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం వేణు శ్రీరామ్. వేణు శ్రీరామ్ దిల్ రాజు బ్యానర్ పై ఇప్పటికే మూడు సినిమాలను చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించి మంచి విజయం  అందుకుంది. ఈ సినిమా […]

Written By: Navya, Updated On : April 18, 2021 12:39 pm
Follow us on

వేణు శ్రీరామ్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకరిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దిల్ రాజు సినిమాలకు బ్యాక్ బోన్ గా ఉన్న వ్యక్తులలో వేణు శ్రీరామ్ ఒకరు. దిల్ రాజు స్క్రిప్ట్ విషయంలో స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం వేణు శ్రీరామ్. వేణు శ్రీరామ్ దిల్ రాజు బ్యానర్ పై ఇప్పటికే మూడు సినిమాలను చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించి మంచి విజయం  అందుకుంది. ఈ సినిమా ద్వారా వేణు శ్రీరామ్ పై దిల్ రాజు పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపును సంపాదించుకున్న వేణు శ్రీరామ్ లో ఓ అసంతృప్తి అలాగే మిగిలిపోయింది. వేణు శ్రీరామ్ ఎంతో ఇష్టపడి రాసుకున్న “ఐకాన్”కథ ఎప్పటికప్పుడు పట్టాలెక్కుతోంది అనుకున్న సమయంలో వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా విజయవంతం కావడంతో వేణు” ఐకాన్ ” పై ఆశలు పెరుగుతున్న ఎలాంటి లాభం లేదు.ఐకాన్ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ ని భావించిన వేణు శ్రీరామ్ కు ఇప్పుడప్పుడే బన్నీ దొరికేలా లేదు. ప్రస్తుతం బన్నీ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.

సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత విక్రమ్ కె కుమార్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు లైన్ లో ఉండగా, వేణు శ్రీరామ్ “ఐకాన్” వచ్చేటప్పటికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి సమయంలోనే వేణు శ్రీరామ్ కు ఓ అద్భుతమైన అవకాశం లభించింది.

అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత కొరటాల శివ సినిమా ఉంటుందని భావించారు. అయితే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఓకే కావడంతో అల్లు అర్జున్, కొరటాల సినిమా 2022 కు వాయిదా పడింది. దీంతో ఈ గ్యాప్ లో వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో ఐకాన్ తీసే అవకాశం లభించింది.ఈ విధంగా కొరటాల శివ ద్వారా వేణు శ్రీరామ్ “ఐకాన్” కల నెరవేరబోతుందని చెప్పవచ్చు.