Homeసినిమా వార్తలుమళ్ళీ కేసీఆర్ మీద పడ్డాడు.. విలన్ మాత్రం బాబునే !

మళ్ళీ కేసీఆర్ మీద పడ్డాడు.. విలన్ మాత్రం బాబునే !

‘సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ’ తన వివాదాల స్ట్రాటజీని అలాగే కంటిన్యూ చేస్తూ.. ఆ మధ్య కేసీఆర్ బయోపిక్ ను ప్రకటించాడు. పైగా ”మా భాషమీద .. నవ్వినవ్, మా మొహం మీద ఊసినవ్ .. మా బాడీలమీద నడిచినవ్ .. ఆంధ్రోడా .. వస్తున్నా .. నీ తాట తీయ్యడానికి వస్తున్నా.. ”అంటూ ప్రకటనలోనే వివాదాన్ని రెచ్చగొట్టి మరీ, కేసీఆర్ జీవిత చరిత్రను కూడా క్యాష్ చేసుకోవడానికి కాస్త గట్టిగానే ప్లాన్ చేశాడు. కానీ ఆ […]

KCR Biopic
‘సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ’ తన వివాదాల స్ట్రాటజీని అలాగే కంటిన్యూ చేస్తూ.. ఆ మధ్య కేసీఆర్ బయోపిక్ ను ప్రకటించాడు. పైగా ”మా భాషమీద .. నవ్వినవ్, మా మొహం మీద ఊసినవ్ .. మా బాడీలమీద నడిచినవ్ .. ఆంధ్రోడా .. వస్తున్నా .. నీ తాట తీయ్యడానికి వస్తున్నా.. ”అంటూ ప్రకటనలోనే వివాదాన్ని రెచ్చగొట్టి మరీ, కేసీఆర్ జీవిత చరిత్రను కూడా క్యాష్ చేసుకోవడానికి కాస్త గట్టిగానే ప్లాన్ చేశాడు. కానీ ఆ తరువాత ఏమైందో ఏమో గానీ, మళ్ళీ వర్మ.. కేసీఆర్ బయోపిక్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

సహజంగా హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వర్మ తాను చేయాల్సిన సినిమాలను వరుస పెట్టి చేసుకుంటూ పోతాడు. పైగా తన సినిమాకు కాంట్రవర్సియల్ పాయింట్ దొరికితే, ఇక ఆ సినిమాని చచ్చినా వదలడు. అలాంటి వర్మ కేసీఆర్ బయోపిక్ ను మధ్యలో వదిలేసి.. ఇప్పడు తీరిగ్గా ఈ బయోపిక్ పనులు మొదలెట్టాడట. ఎలాగూ తన సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు కాబట్టి.. రానున్న రోజుల్లో కేసీఆర్ బయోపిక్ తో సడెన్ షాక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ బయోపిక్ లో హీరో కేసీఆర్ అయితే, విలన్ ఎప్పటిలా చంద్రబాబునే.

ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, అలాగే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాల్లో చంద్రబాబును పచ్చి అవకాశవాడిగా ఒక విలన్ గా చూపించాడు. ఇప్పుడు కేసీఆర్ సినిమాలో కూడా అలాగే చూపించబోతున్నాడట. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్న వర్మ, ఈ సినిమా డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేయడానికి మరో దర్శకుడ్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బయోపిక్ కోసం కొందరు తెరాస పార్టీ కీలక నేతలతో కూడా వర్మ చర్చలు జరిపాడట. మరి ఈ సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయి ? కేసీఆర్ లైఫ్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper