https://oktelugu.com/

పాయల్ వెళ్ళదట.. మరి ఏ స్టార్స్ యస్ చెబుతారో ?

‘బిగ్ బాస్ 5’ ఆగస్టులో మొదలుకానుందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఫలనా హీరోయిన్ కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందని పుకార్లు మొదలైపోయాయి. ఈ పుకార్లలో ప్రముఖంగా వినిపిస్తోన్న హీరోయిన్ పేరు పాయల్ రాజపుత్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి పాయల్ ఓకే చెప్పిందని వస్తోన్న ప్రచారంలో ఎంత వాస్తవం ఉందని ఎంక్వేరీ చేస్తే.. అందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. పాయల్ లాంటి హీరోయిన్స్ లో ఒకర్ని హౌస్ లోకి తీసుకురావడానికి బిగ్ బాస్ […]

Written By: , Updated On : June 7, 2021 / 12:27 PM IST
Follow us on

‘బిగ్ బాస్ 5’ ఆగస్టులో మొదలుకానుందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఫలనా హీరోయిన్ కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందని పుకార్లు మొదలైపోయాయి. ఈ పుకార్లలో ప్రముఖంగా వినిపిస్తోన్న హీరోయిన్ పేరు పాయల్ రాజపుత్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి పాయల్ ఓకే చెప్పిందని వస్తోన్న ప్రచారంలో ఎంత వాస్తవం ఉందని ఎంక్వేరీ చేస్తే.. అందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.

పాయల్ లాంటి హీరోయిన్స్ లో ఒకర్ని హౌస్ లోకి తీసుకురావడానికి బిగ్ బాస్ కూడా ప్రతి సీజన్ లో ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు, ఈ క్రమంలోనే గతంలో కూడా పాయల్ పేరు బాగా వినిపించింది. కాకపోతే, పాయల్ గత సీజన్స్ లో తనకు అవకాశం వచ్చినా నో చెప్పింది. అప్పుడే, తనకు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వాలని లేదు అంటూ తానూ హీరోయిన్ గా ఫుల్ బిజీ అంటూ పాయల్ చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ లోకి ఫేడ్ అవుట్ భామలే ఎక్కువుగా ఎంట్రీ ఇస్తారని.. అలాంటి షోలోకి తానూ వెళ్తే.. తన ఇమేజ్ కి భారీ డ్యామేజ్ వస్తోందని పాయల్ ఫీల్ అవుతుంది. అయితే, ప్రస్తుతం పాయల్ కి ఎలాంటి డిమాండ్ లేదు. ఐటమ్ సాంగ్స్ కూడా పాయల్ కి రావడం లేదు. మరి ఈ 5వ సీజన్ లోనైనా పాయల్ పాల్గొంటే బాగానే క్యాష్ చేసుకోవచ్చు. కానీ, పాయల్ మాత్రం ఆసక్తి చూపించడం లేదు.

ఇక ఈ సారి హౌస్ లోకి ఎవరు కంటెస్టెంట్లుగా పాల్గొంటారనే విషయంలో ‘బిగ్ బాస్ 5’లో ఈ సారి పేరున్న స్టార్స్ ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. గత సీజన్ లో స్టార్లు పెద్దగా లేకపోవడం వల్ల, షోలో ఎక్కువుగా కొత్తవాళ్లే ఉండటం వల్ల స్టార్టింగ్ లో ప్రేక్షకుల నుండి బాగా విమర్శలు వచ్చాయి. మరి ఈ సారి కూడా కొత్తవాళ్లు చిన్నవాళ్ళే ఉంటారా ? లేక స్టార్ డమ్ ఉన్నవాళ్ళు కూడా జాయిన్ అవుతారా అనేది చూడాలి.