https://oktelugu.com/

ప్రారంభమైన ఆనందయ్య మందు సరఫరా

ప్రపంచవ్యాప్తంగా ఏ మందు కూడా కరోనాను నివారించడం లేదు. కరోనాకు చికిత్స చేయడానికి అసలు మందులే లేవు. మన రోగనిరోధక వ్యవస్థ బాగుంటే బతుకుతున్నారు. లేదంటే చనిపోతున్న పరిస్థితి. ఇప్పుడు వేసే మందులన్నీ కేవలం ఉపశమనానికి మాత్రమే. కరోనాతో లక్షల మంది ప్రాణాలు పోయి.. కోట్ల మందికి సోకుతున్న వేళ అంతంలేని ఈ మహమ్మారిని అరికట్టేశాడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆనందయ్య. ఆనందయ్య మందు కరోనాను నివారిస్తుండడంతో ఆ మందు కోసం జనాలు కృష్ణపట్నంకు క్యూకట్టారు. ప్రభుత్వం […]

Written By:
  • NARESH
  • , Updated On : June 7, 2021 12:11 pm
    Follow us on

    ప్రపంచవ్యాప్తంగా ఏ మందు కూడా కరోనాను నివారించడం లేదు. కరోనాకు చికిత్స చేయడానికి అసలు మందులే లేవు. మన రోగనిరోధక వ్యవస్థ బాగుంటే బతుకుతున్నారు. లేదంటే చనిపోతున్న పరిస్థితి. ఇప్పుడు వేసే మందులన్నీ కేవలం ఉపశమనానికి మాత్రమే.

    కరోనాతో లక్షల మంది ప్రాణాలు పోయి.. కోట్ల మందికి సోకుతున్న వేళ అంతంలేని ఈ మహమ్మారిని అరికట్టేశాడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆనందయ్య. ఆనందయ్య మందు కరోనాను నివారిస్తుండడంతో ఆ మందు కోసం జనాలు కృష్ణపట్నంకు క్యూకట్టారు. ప్రభుత్వం దాన్ని ఆపు చేయించి పరిశోధించి.. ఈ మందు హానికరం కాదని తేల్చింది. దీంతో హైకోర్టు కూడా అనుమతించడం.. కేంద్రం సరేననడంతో ఆనందయ్య మందు పంపిణీకి అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

    నిన్నటి నుంచి నెల్లూరులో ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలు పంపిణీ చేస్తానని ఆనందయ్య తెలిపారు. ముందుగా తన నియోజకవర్గం ప్రజలకు పంపిణీ చేసేకే ఇతర ప్రాంతాల వారికి పంపిణీ చేస్తానని తెలిపారు.

    ఇక సోమవారం నుంచి చిత్తూరు జిల్లాలో కూడా ఆనందయ్య మందు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. మందు తయారీ కోసం ఈ జిల్లాలోని చంద్రగిరి మండలంను ఎంపిక చేసుకున్నారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్ నేతృత్వంలో ముక్కోటి తీర్థంలో ఔషధం తయారీ చేయనున్నారు. ముందుగా చిత్తూరు జిల్లాల్లో ఈ ఔషధం పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కో మండంలో ఒక్కో వారం ఔషధంను పంపిణీ చేసేందుకు ఆనందయ్య కుటుంబం కసరత్తు చేస్తోంది. మండలాల నుంచి గ్రామ పంచాయతీలకు మెడిసిన్ సరఫరా చేయాలని భావిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఈ మందును ఇంటింటికి పంపిణీ చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు.