https://oktelugu.com/

‘అల్లు అర్జున్’తోనా? రాంచరణ్ తోనా? తేలేది అప్పుడే !

రాజమౌళి తర్వాత హీరోలందరూ ఇంట్రెస్ట్ చూపిస్తోన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే, రీసెంట్ గా ప్రశాంత్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత డీవీవీ దానయ్య మా డైరెక్టర్ అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేసాడు. అప్పటి నుండి ప్రశాంత్ డైరెక్షన్ లో రామ్ చరణ్. కాదు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ అంటూ ఇలా రోజుకో పుకారు వస్తూనే ఉంది. మరోపక్క బాలీవుడ్ మీడియా కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో షాహిద్ […]

Written By:
  • admin
  • , Updated On : June 7, 2021 / 12:46 PM IST
    Follow us on

    రాజమౌళి తర్వాత హీరోలందరూ ఇంట్రెస్ట్ చూపిస్తోన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే, రీసెంట్ గా ప్రశాంత్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత డీవీవీ దానయ్య మా డైరెక్టర్ అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేసాడు. అప్పటి నుండి ప్రశాంత్ డైరెక్షన్ లో రామ్ చరణ్. కాదు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ అంటూ ఇలా రోజుకో పుకారు వస్తూనే ఉంది.

    మరోపక్క బాలీవుడ్ మీడియా కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు అంటూ అక్కడి వెబ్ సైట్స్ హడావుడి చేస్తున్నాయి. మొత్తానికి ఈ కన్నడ దర్శకుడికి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఫుల్ క్రేజ్ దక్కింది. ఆ క్రేజ్ కారణంగా ప్రశాంత్ ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడట. అన్ని భారీ సినిమాలే, ఏ సినిమాకి నో చెప్పలేని పరిస్థితి.

    అలా అని అన్నీ సినిమాలు అంగీకరించలేని స్థితి. ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్ని సినిమాలు అని చెయ్యగలడు ? ప్రస్తుతం ప్రభాస్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ ‘సలార్’ చేసున్నాడు. కరోనా సెకెండ్ వేవ్ లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం తారుమారు అయ్యాయి. ఇది పూర్తి కావాలంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు పట్టేలా ఉంది.

    ఆ తర్వాత ఎలాగూ ఎన్టీఆర్ తో సినిమా ఉంది. ఎన్టీఆర్ సినిమా ఇంటెర్ నేషనల్ ప్రాజెక్ట్ అట. ఎన్టీఆర్ మూవీ కంప్లీట్ అవ్వాలి అంటే, దాదాపు రెండేళ్లు పడుతుంది. అంటే, మూడేళ్లు వరకూ ప్రశాంత్ ఫుల్ బిజీ. ఆ తర్వాత యష్ తో మళ్ళీ సినిమా ఉంది. అప్పటికీ గాని ప్రశాంత్ ఫ్రీ అవ్వడు. ఆ తర్వాత గానీ అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడా? రామ్ చరణ్ తో సినిమా చేస్తాడా అనేది తేలుతుంది.