
నిన్న ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. కార్యక్రమం మొదలైన కాసేపటి తర్వాత పవన్ హాజరయ్యారు. బౌన్సర్ నడుమ వచ్చిన పవన్.. తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. కాసేపటి తర్వాత వేదిక మీదకు వెళ్లారు. తనదైన ప్రసంగంతో అందరినీ అలరించారు. అయితే.. ఈ ఫంక్షన్లో ఆయన ప్రసంగంతోపాటు మరో విషయం కూడా హైలెట్ అయ్యింది. అదే.. ఆయన వేలికి ఉన్న ఉంగరాలు.
గతంలో ఎప్పుడూ పెద్దగా వేలికి ఉంగరాలతో కనిపించని పవన్.. ఈ ఫంక్షన్ రెండుమూడు ఉంగరాలతో హాజరయ్యారు. అందులోనూ ఓ స్పెషల్ ఉంగరం కూడా ఉంది. అది నాగుపాము చిత్రాన్ని పోలి ఉంది. దీంతో.. అందరూ దాన్ని నాగ అంగుళీకము అంటున్నారు. అయితే.. ఆ ఉంగరం పవన్ ఎందుకు ధరించాల్సి వచ్చింది? ఎవరు ఇచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది.
గతంలో పెద్దగా ఇలాంటి నమ్మకాలు పాటించని పవన్.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫుల్లుగా ఫాలో అవుతున్నారనే చర్చ సాగుతోంది. ఇందులో ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర చాలా ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. త్రివిక్రమ్ దగ్గరుండి పవన్ కు ఉపనయనం (జంధ్య వేయించడం) చేయించడం అనే వేడుక కూడా చేయించారని ప్రచారం సాగుతోంది.
తద్వారా బ్రహ్మణిజాన్ని పవన్ ఫాలో అవుతున్నారని కూడా కొందరు చెబుతున్నారు. వీళ్లిద్దరికీ కామన్ గురువు అయిన వ్యక్తే ఈ ఉంగరాన్ని ఇచ్చారని సమాచారం. ఈ ప్రత్యేక ఉంగరాన్ని ధరించాలని ఆయనే సూచించారని, ఆయన సూచన మేరకే పవన్ ఈ ప్రత్యేక నాగు అంగుళీకాన్ని ధరించారని అంటున్నారు. మరి, దీని వెనుక ఆంతర్యం ఏంటన్నది మాత్రం ఆయనే చెప్పాల్సి ఉంది.