అవకాశాల కోసం హాట్ బ్యూటీ ఆరాటం !

హాట్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్‌ లో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హాట్ అందాలతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మతులు పోగొట్టిన ఈ బ్యూటీకి ఆ తరువాత అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. నిజానికి ఇస్మార్ట్ శంకర్ లో హాట్ హాట్‌గా నటించి సెగలు రేపిన ఈ బ్యూటీ.. తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. ఎలాగూ నభా తన నటనలోనూ మంచి […]

Written By: admin, Updated On : March 27, 2021 3:20 pm
Follow us on


హాట్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్‌ లో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హాట్ అందాలతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మతులు పోగొట్టిన ఈ బ్యూటీకి ఆ తరువాత అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. నిజానికి ఇస్మార్ట్ శంకర్ లో హాట్ హాట్‌గా నటించి సెగలు రేపిన ఈ బ్యూటీ.. తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. ఎలాగూ నభా తన నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది కాబట్టి.. అమ్మడు రేంజ్ తారా స్థాయికి చేరింది. అక్కడ నుండి వరుస ఆఫర్లతో దూసుకెళ్తోందని అనుకంటే ప్రస్తుతం అవకాశాల కోసం చిన్నాచితకా హీరోల దర్శకుల చుట్టూ తిరుగుతుందట.

కాగా కేవలం ఛాన్స్ లు కోసమే ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందట. పైగా అభిమానులకి కూడా ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ తో వినోదం పంచుతూ రోజురోజుకూ రెచ్చిపోతుంది. ఇక తన కెరీర్ గురించి నభా మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులు నన్ను సొంత అమ్మాయిలా తమ ఇంట్లో అమ్మాయిగా చూస్తారు. అలాగే ఇక్కడ మేకర్స్ కూడా నాపై చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు పరిశ్రమ నాకు మరో పుట్టినిల్లు. అందుకే నేను ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించడానికే ఇష్టపడతాను.

ఎందుకంటే నా పై అభిమానం, ఆదరణ చూపిస్తున్న తెలుగు ప్రజలని నేను ఎప్పటికి మరచిపోలేను. అలాగే నన్ను నమ్మి నాకు ఛాలెంజింగ్ రోల్స్ ఇచ్చి నా కెరీర్ కి గొప్ప పునాది వేస్తోన్న నా తెలుగు దర్శకులు అందరికీ నేను కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను అంటూ మొత్తానికి నభా బాగానే తెలివి చూపిస్తోంది. ఎలాగైనా తెలుగులో అవకాశాలు అందుకోవాలి అనేది అమ్మడు ఆరాటం. పనిలో పనిగా అమ్మడికి విభిన్నమైన పాత్రలు చేయాలని ఉందట. తాను గ్లామర్‌ పాత్రలు చేస్తున్నప్పటికీ ఎప్పుడూ నభా హద్దులు దాటలేదు. మరి ఆమె హద్దులు దాటితే ఇక ఎలా ఉంటుందో. అన్నట్టు ఆమె కెరీర్ ఇపుడు మొగ్గ దశలోనే ఉందట. అన్ని రకాల క్యారెక్టర్స్ తో చరిత్రలో నిలిచిపోయే మంచి పాత్రలు చేస్తానంటుంది నభా.