మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన పుట్టినరోజును ‘ఆర్ఆర్ఆర్’ సెట్ లో ఘనంగా జరుపుకున్నారు. దర్శకుడు రాజమౌళితోపాటు చిత్రబృందం కలిసి రాంచరణ్ చేత కేక్ కట్ చేయించారు.
2007 లో ‘చిరుత’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, తరువాత వివిధ చిత్రాల్లో రాంచరణ్ నటించారు. తనను తాను మెరుగుపరుచుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన తారలలో ఒకరిగా ఎదిగాడు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. చిరును మించి ఎదుగుతున్నారు. రామ్ చరణ్ ఎంత ఎదిగినా ఇప్పటికీ పెద్దల పట్ల ఒద్దికగా ఉండే స్వభావమే అతడిని స్టార్ గా నిలబెడుతోంది.
ప్రస్తుతం రాంచరణ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో నటస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ బృందం తాజాగా సెట్స్‌లో రామ్ చరణ్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించింది.
ఆర్‌ఆర్‌ఆర్ ట్విట్టర్ హ్యాండిల్ కొన్ని బర్త్ డే ఫోటోలను పంచుకుంది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో, ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి స్వయంగా రామ్ చరణ్ కు కేక్ తినిపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ ట్వీట్ చేస్తూ “నిన్న రాత్రి సెట్స్‌లో మా రామరాజు పుట్టినరోజు జరుపుకున్నాం. మీకు బ్లాక్‌బస్టర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాం.’ అని ట్వీట్ చేశారు.
Had a blast celebrating our RAMA RAJU’s birthday on the sets last night…:)
Wishing you a BLOCKBUSTERRR YEAR ahead. @alwaysramcharan 🔥❤️ #HBDRamCharan #AlluriSitaRamaRaju pic.twitter.com/2xX4zp9fjo
— RRR Movie (@RRRMovie) March 27, 2021