Chiranjeevi YS Jagan Meet: మెగాస్టార్ చిరంజీవి ఏపీలో థియేటర్లు, టికెట్ రేట్ల వ్యవహారం పై జగన్ తో భేటీ అయి చర్చించిన సంగతి తెలిసిందే. అయితే, చిరంజీవి పై మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా తెలిసిందే. జగన్ తో చిరంజీవి ఎలాంటి చర్చ జరపలేదు అని, జగన్ భోజనానికి పిలిస్తే.. చిరంజీవి వచ్చి తిని వెళ్లారు అని పేర్ని నాని కామెంట్స్ చేశాడు. అయితే, తాజాగా ఈ అంశం పై రఘురామకృష్ణరాజు సీరియస్ అయ్యారు.

రఘురామకృష్ణంరాజు మాటల్లోనే.. ‘చిరంజీవికి మంత్రి పేర్ని నాని క్షమాపణలు చెప్పాలి. సినిమా టికెట్ల ధరపై సీఎం జగన్ తో చర్చించేందుకే చిరంజీవి వెళ్లారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇక నా పై అనర్హత వేటు వేయించలేమని YCP చెబితే తక్షణం రాజీనామా చేస్తాను. క్యాసినోతో కొడాలి నానికి సంబంధం లేదని భావిస్తున్నాను. కొడాలి నానిని అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతోంది’ అని రఘురామకృష్ణంరాజు అన్నారు.

కాగా నాగార్జున మాత్రం ‘చిరు – జగన్’ భేటీ పై మరోలా స్పందించాడు. సీఎం జగన్‌తో భేటీ గురించి చిరంజీవితో మాట్లాడాను. అంతా మంచే జరుగుతుందని చిరంజీవి చెప్పారు. సినీ పరిశ్రమపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. సినీ పరిశ్రమకు ఇక అన్నీ మంచిరోజులే. త్వరలోనే టికెట్ ధరలపై సానుకూల నిర్ణయం వస్తుంది’ అని నాగార్జున చెప్పుకొచ్చాడు. మరి ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదు. అసలు చిరంజీవి కలిసి వచ్చి రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ లేదు. మరి చిరు జగన్ దగ్గర సాధించింది ఏమిటి ?

[…] Also Read: చిరు ‘జగన్’ దగ్గర సాధించింది ఏమిటి ? […]