HomeMoviesANR biopic : ఏఎన్నార్ యానివర్సరీ స్పెషల్ గా అక్కినేని బయోపిక్ !

ANR biopic : ఏఎన్నార్ యానివర్సరీ స్పెషల్ గా అక్కినేని బయోపిక్ !

Latest  hint about  Akkineni Nageswara Rao  biopic  : ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు పరిశ్రమకు  రెండు కళ్ళు. అయితే,   ఇప్పటికే  ఎన్టీఆర్,  సావిత్రి,  జయలలిత లాంటి గొప్ప నటీనటుల  బయోపిక్ లు వచ్చి అలరించాయి. కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్   కాకపోయినా   వారి గొప్పతనం గురించి భావితరాలకు  చక్కగా తెలియజేశాయి.   మరి ఏఎన్నార్ బయోపిక్ మాటేమిటి ? ఆయన గొప్పతనం గురించి రాబోయే తరాలకు తెలియాలి కదా.  నిజానికి ఏఎన్నార్  బయోపిక్ అనే విషయం  గత కొన్ని నెలలుగా నాగార్జున మదిలో మెదులుతూనే ఉంది. 

ANR

కానీ  అక్కినేని నాగేశ్వరరావులా ఎవరు నటించగలరు. ఏఎన్నార్  నటుడు మాత్రమే కాదు, క్రమశిక్షణకు  మారుపేరు కూడా.  ఇక  రొమాంటిక్ ఫీలింగ్స్ కి కేరాఫ్ అడ్రస్  కూడా.  పైగా  అన్నపూర్ణ స్టూడియో స్థాపనకు కృషి చేసి..  తెలుగు సినిమా వాళ్లకు ఒక గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి కూడా. అసలు  అన్నిటికీ మించి  తెలుగు చిత్ర సీమను  మద్రాసు నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చిన మొట్టమొదటి హీరో కూడా.    అందుకే, అక్కినేని బయోపిక్ పై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉన్నాయి.  

ANR
ANR

తాజాగా మరోసారి ఏఎన్నార్ బయోపిక్ పై కొత్త రూమర్ వినిపిస్తోంది.  ఈ రోజు ఏఎన్నార్ యానివర్సరీ. అందుకే.. మళ్ళీ ఏఎన్నార్ బయోపిక్  వార్తల్లో నిలిచింది.  నాగార్జున నిర్మాతగా   ఈ బయోపిక్  స్టార్ట్ కానుందట. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఈ బయోపిక్ రాబోతుందట.  మరి ఏఎన్నార్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. 

 

సుమంత్ అయితే బాగుంటుంది అని నాగ్ ఫీల్ అవుతున్నాడు. అయినా   ఏఎన్నార్ జీవితాన్ని చూపించాలి అంటే..  అన్ని దశలు చూపించాలి. కాబట్టి, నలుగురు హీరోలు ఏఎన్నార్ గా కనిపించే అవకాశం ఉంది.

 

NTR ANR

 

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular