https://oktelugu.com/

‘చిరు’ సినిమా లేకపోతే.. ‘పవన్’ ఈ సినిమా చేసేవాడు !

‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా’ కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయిపోయాయి. నిజానికి మొదట “విక్రమ్ వేద” అనే సినిమా చేయాలనుకున్నారు పవన్. అప్పుడెప్పుడో మూడేళ్ల కిందటొచ్చిన ఈ తమిళ సూపర్ హిట్ సినిమా కథ, పవన్ కళ్యాణ్ కి చాల బాగా నచ్చిందట. మెహర్ రమేష్ కి అవకాశం ఇచ్చి, అతని డైరెక్షన్ లో తానే ఈ సినిమాని నిర్మించాలని పవన్ ప్లాన్ చేశారట. కానీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 21, 2021 / 06:56 PM IST
    Follow us on


    ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా’ కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయిపోయాయి. నిజానికి మొదట “విక్రమ్ వేద” అనే సినిమా చేయాలనుకున్నారు పవన్. అప్పుడెప్పుడో మూడేళ్ల కిందటొచ్చిన ఈ తమిళ సూపర్ హిట్ సినిమా కథ, పవన్ కళ్యాణ్ కి చాల బాగా నచ్చిందట. మెహర్ రమేష్ కి అవకాశం ఇచ్చి, అతని డైరెక్షన్ లో తానే ఈ సినిమాని నిర్మించాలని పవన్ ప్లాన్ చేశారట. కానీ మెగాస్టార్ కి వేదాలం సినిమా బాగా నచ్చడంతో ఆ సినిమాని మెహర్ రమేష్ తెలుగులోకి రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

    Also Read: ప్రిన్స్.. జక్కన్న మూవీ.. నిజమేనా అంటున్న ఫ్యాన్స్..

    వేదాలం తమిళ్ లో హిట్టవ్వడమే ఆలస్యం, దాన్ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు అంటూ బాగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కాస్త మెగాస్టార్ – మెహర్ రమేష్ కలయికలో మొత్తానికి పట్టాలెక్కబోతుంది. ఈ సినిమా గానీ చేయకపోయి ఉండి ఉంటే.. పవన్ ‘విక్రమ్ వేద’ సినిమాని తెలుగులో చేసేవారు. కేవలం వేదాలమ్ వల్లనే పవన్ విక్రమ్ వేదను పక్కన పెట్టాడట. అంతలో విక్రమ్ వేద బదులు “అయ్యప్పన్ కోషియమ్” సినిమాని లైన్ లోకి తీసుకువచ్చాడు. మలయాళంలో హిట్టయిన సినిమా ఇది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    తెలుగులో రీమేక్ చేసేందుకు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఇప్పటికే సన్నాహాలు చేసింది. ‘రానా – పవన్’ కీలక పాత్రలుగా ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. స్టార్ హీరోల ప్రాజెక్టు కాబట్టి.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రెజెంట్ షూటింగ్ ప్లాన్ ప్రకారం వచ్చే నెల 16 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేయబోతున్నట్లు సమాచారం. అన్నట్టు ఈ సినిమా కోసం పవన్ బల్క్ డేట్స్ ను కేటాయించాడట.