సుకన్య సమృద్ధి యోజన స్కీమ్, పీపీఎఫ్ లో ఏది బెటరంటే..?

చాలామంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుకన్య సమృద్ధి యోజన లేదా పీపీఎఫ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీర్ఘకాలిక అవసరాల కొరకు పొదుపు పెట్టుబడి స్కీమ్ ను ఎంచుకునే సమయంలో తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూతుళ్ల విద్య, వివాహం కొరకు ఈ స్కీమ్ లను అమలు చేస్తుంటారు. ఆదాయపు పన్ను మినహాయింపులకు పీపీఎఫ్‌ స్కీమ్ ఉత్తమమని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ వడ్డీతో పాటు […]

Written By: Navya, Updated On : March 21, 2021 6:30 pm
Follow us on

చాలామంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుకన్య సమృద్ధి యోజన లేదా పీపీఎఫ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీర్ఘకాలిక అవసరాల కొరకు పొదుపు పెట్టుబడి స్కీమ్ ను ఎంచుకునే సమయంలో తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూతుళ్ల విద్య, వివాహం కొరకు ఈ స్కీమ్ లను అమలు చేస్తుంటారు. ఆదాయపు పన్ను మినహాయింపులకు పీపీఎఫ్‌ స్కీమ్ ఉత్తమమని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ వడ్డీతో పాటు ట్యాక్స్ బెనిఫిట్లను పొందే అవకాశం ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై వచ్చే వడ్డీ, ఇతర రిటర్నులపై ఆదాయపు పన్ను వర్తించకపోవడంతో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసినవాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది. 500 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ గడువు 15 సంవత్సరాలు కాగా ప్రస్తుతం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 7.1 శాతం వడ్డీగా ఉంది. 2015 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ సుకన్య సమృద్ధి స్కీమ్ ను ప్రారంభించారు. 18 సంవత్సరాలు దాటిన బాలిక సుకన్య సమృద్ధి స్కీమ్ ద్వారా ప్రయోజనాలు పొందడానికి అర్హురాలు. బాలిక పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల లోపు ఈ స్కీమ్ లో చేరవచ్చు. కనీసం 250 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఈ స్కీమ్ పై వచ్చే వడ్డీ విషయంలో కూడా పన్ను మినహాయింపులను పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.6 శాతం వడ్డీరేటు లభిస్తోంది. సుకన్య సమృద్ధి స్కీమ్ కు ఎక్కువ వడ్డీరేటు లభిస్తుండగా పీపీఎఫ్ స్కీమ్ ను ఎక్కువ సంవత్సరాలు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఎవరి అవసరాలకు అనుగుణంగా వాళ్లు స్కీమ్ ను ఎంచుకుంటే మంచిది.