‘వకీల్ సాబ్’లో మెగాహీరో.. నరాలు తెంపుకుంటున్న ఫ్యాన్స్!

వకీల్ సాబ్ మేనియా ఇప్పుడు అభిమానులను ఓ రేంజ్ లో ఊపేస్తోంది. మూడేళ్ల త‌ర్వాత త‌మ హీరోను తెర‌పై చూసుకునేందుకు ఫ్యాన్స్ క‌ళ్ల‌లో ఒత్తులేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు.. సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఈ చిత్రంపై ఆస‌క్తితో ఉన్నారు. లాక్ డౌన్ త‌ర్వాత విడుద‌లైన పెద్ద సినిమా ఇదే కావడంతో.. అంద‌రి క‌ళ్లూ ప‌వ‌న్ మూవీపైనే ఉన్నాయి. దీనికితోడు ఈ నెల 29న విడుద‌లైన ట్రైల‌ర్‌ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ అల‌రించింది. ప‌వ‌ర్ స్టార్ త‌న‌కు […]

Written By: Bhaskar, Updated On : April 2, 2021 1:01 pm
Follow us on


వకీల్ సాబ్ మేనియా ఇప్పుడు అభిమానులను ఓ రేంజ్ లో ఊపేస్తోంది. మూడేళ్ల త‌ర్వాత త‌మ హీరోను తెర‌పై చూసుకునేందుకు ఫ్యాన్స్ క‌ళ్ల‌లో ఒత్తులేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు.. సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఈ చిత్రంపై ఆస‌క్తితో ఉన్నారు. లాక్ డౌన్ త‌ర్వాత విడుద‌లైన పెద్ద సినిమా ఇదే కావడంతో.. అంద‌రి క‌ళ్లూ ప‌వ‌న్ మూవీపైనే ఉన్నాయి.

దీనికితోడు ఈ నెల 29న విడుద‌లైన ట్రైల‌ర్‌ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ అల‌రించింది. ప‌వ‌ర్ స్టార్ త‌న‌కు మాత్ర‌మే సొంత‌మైన పెర్ఫార్మెన్స్ తో ఇర‌గ‌దీయ‌గా.. ద‌ర్శ‌కుడు అత్యంత ఆస‌క్తిగా ట్రైల‌ర్ ను క‌ట్ చేశాడు. దీంతో.. అప్ప‌టి వ‌ర‌కూ సాధార‌ణంగా ఉన్న వ‌కీల్ సాబ్ ప్ర‌చారం.. ఒక్క ట్రైల‌ర్ తో ఆకాశానికి ఎగిశాయి. దీంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దే లేకుండాపోయింది.

అయితే.. ఇప్పుడు మ‌రో స‌ర్ ప్రైజింగ్ న్యూస్ అభిమానుల‌ను నేల‌పై నిల‌వ‌నీయ‌ట్లేదు. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ థ‌మ‌న్ కూడా సినిమా సెకండ్ హాఫ్ లో బిగ్ స‌ర్ ప్రైజ్ ఉందంటూ చెప్ప‌డంతో.. అదేంటోన‌ని అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే.. అందుతున్న అప్డేట్ ప్ర‌కారం.. ఈ సినిమాలో మెగా హీరో సంద‌డి చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

కొన్ని నిమిషాల పాటు మెగా హీరో క‌నిపించ‌బోతున్నార‌న్న స‌మాచారం లీక్ కావ‌డంతో.. ఎవ‌రై ఉంటార‌నే డిస్క‌ష‌న్లో మునిగిపోయారు ఫ్యాన్స్‌. అది మెగాస్టార్ చిరంజీవినా? లేక మెగాపవర్ స్టార్ రామ్ చరణా? ఇంకా మ‌రెవరైనా అయ్యుంటారా? అని చ‌ర్చించుకుంటున్నారు. అర్జెంటుగా సినిమా చూసేసి, ఆతృత చ‌ల్లార్చుకోవాల‌నే భావ‌న‌లో ఉన్నారు ఫ్యాన్స్‌. మ‌రి, ఆ స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌బోయే మెగా హీరో ఎవ‌ర‌నేది తెలియాలంటే ఏప్రిల్ 9 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్