ఆ ఎమ్మెల్యే జర్మనీ పౌరుడే..!

ఒక్క ఎమ్మెల్యే పౌరసత్వం తేల్చేందుకు ఏళ్లకు ఏళ్లు టైమ్‌ పడుతోంది. భారతదేశ ప్రజాస్వామ్యం ఎంత డొల్లగా ఉందో నిరూపించే ఘటన ఇది. పౌరసత్వం లేని వ్యక్తి దేశంలో వరుసగా ఎన్నికల్లో పాల్గొంటూ వస్తున్నాడు. గెలుస్తూ వస్తున్నాడు. ఆయన ఈ దేశ పౌరుడు కాదని నిరూపించడానికి ఎవరితరమూ కావడం లేదు. కేసు తేలడం.. కింది కోర్టు.. పై కోర్టు.. కేంద్రం.. ఇలా వరుసగా ఆలస్యం జరుగుతుండడం చూస్తున్నాం. చివరికి ఇప్పుడు.. ఆయన జర్మనీ పౌరుడేనని కేంద్రం హైకోర్టుకు రిపోర్ట్ […]

Written By: Srinivas, Updated On : April 2, 2021 1:22 pm
Follow us on


ఒక్క ఎమ్మెల్యే పౌరసత్వం తేల్చేందుకు ఏళ్లకు ఏళ్లు టైమ్‌ పడుతోంది. భారతదేశ ప్రజాస్వామ్యం ఎంత డొల్లగా ఉందో నిరూపించే ఘటన ఇది. పౌరసత్వం లేని వ్యక్తి దేశంలో వరుసగా ఎన్నికల్లో పాల్గొంటూ వస్తున్నాడు. గెలుస్తూ వస్తున్నాడు. ఆయన ఈ దేశ పౌరుడు కాదని నిరూపించడానికి ఎవరితరమూ కావడం లేదు. కేసు తేలడం.. కింది కోర్టు.. పై కోర్టు.. కేంద్రం.. ఇలా వరుసగా ఆలస్యం జరుగుతుండడం చూస్తున్నాం. చివరికి ఇప్పుడు.. ఆయన జర్మనీ పౌరుడేనని కేంద్రం హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు తెలంగాణలోని వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్.

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై చాలా కాలంగా వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ఆర్చుకుని.. తీర్చుకుని కేంద్రం చెన్నమనేని పౌరసత్వం వివాదంపై అఫిడవిట్ ధాఖలు చేసింది. చెన్నమనేని ఇంకా జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని స్పష్టం చేసింది. అయితే ఆయన బీజేపీ నాయకుల బంధువనుకున్నారేమో కానీ.. కేసును మరింత సాగదీయడానికి లొసుగులు కూడా ఇచ్చారు.

నేరుగా చెప్పినా.. జర్మనీ పాస్‌పోర్టు ఉందనే కారణమే చెప్పారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నవారికి మాత్రమే పాస్‌పోర్టు కొనసాగిస్తారు. నిజానికి కేంద్రం తేల్చాలనుకుంటే.. రెండు నిమిషాల పని. కానీ.. ఇప్పటికే ఏళ్ల తరబడి సాగదీస్తూనే ఉంది. ఇప్పడు చెప్పినా.. సమర్థించుకోవడానికి చెన్నమనేనికి మరో ఛాన్సిచ్చింది. చెన్నమనేని రమేష్ చాలా కాలంగా జర్మనీలోనే ఉంటున్నారు.

లాక్‌డౌన్ ముందు జర్మనీ వెళ్లారు. ఆయన మళ్లీ తిరిగి రాలేదు. ఒకటి రెండు సార్లు ఆన్‌లైన్ మీటింగ్‌లో పాల్గొంటుంటారు. ఇటీవల ఆ నియోజకవర్గం నుంచి కొంత మంది అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఎమ్మెల్యే జర్మనీకి వెళ్లి రావడం లేదని ఆందోళనలు చేస్తున్నారు. చెన్నమనేని రమేష్ స్థిరనివాసం జర్మనీలోనే. ఆయన భార్య.. పిల్లలు అందరూ జర్మన్ పౌరులే. ఆయన జర్మనీ పౌరసత్వాన్ని వదులుకోవడం లేదు. అయినప్పటికీ.. ఇండియాలో చాలా కాలంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్