https://oktelugu.com/

ఎవరు చేయని పనిని చేస్తోన్న మంచు లక్ష్మీ !

మంచు లక్ష్మీని ప్రతి చిన్న విషయానికి ట్రోల్ చేస్తూ ఇబ్బంది పెడతారు గానీ, ఆమె ఈ సమాజానికి చేస్తోన్న సేవ ఎంతో ఉంది. అప్పుడప్పుడు తన ప్రవర్తనతో తన మాటలతో నెటిజన్లను ఇబ్బంది పెట్టినా, ఆమెలో మంచి మనసు ఉంది. ఆపదలో ఉన్న వారినీ ఆదుకునే స్వభావం ఉంది. ఇక ఈ క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్‌ లో సరైన వైద్యం అందక, ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. మరో పక్క కరోనా […]

Written By:
  • admin
  • , Updated On : May 22, 2021 9:43 am
    Follow us on

    lakshmi
    మంచు లక్ష్మీని ప్రతి చిన్న విషయానికి ట్రోల్ చేస్తూ ఇబ్బంది పెడతారు గానీ, ఆమె ఈ సమాజానికి చేస్తోన్న సేవ ఎంతో ఉంది. అప్పుడప్పుడు తన ప్రవర్తనతో తన మాటలతో నెటిజన్లను ఇబ్బంది పెట్టినా, ఆమెలో మంచి మనసు ఉంది. ఆపదలో ఉన్న వారినీ ఆదుకునే స్వభావం ఉంది. ఇక ఈ క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్‌ లో సరైన వైద్యం అందక, ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది.

    మరో పక్క కరోనా సోకి వైద్యం కోసం సిటీకి వచ్చిన ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. వీరిలో స‌కాలంలో వైద్య స‌దుపాయం అంద‌క చాలా మంది ప్రాణాల‌ను కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. మరి కుటుంబానికి అండగా ఆర్థిక అవసరాలు తీర్చే మనిషిని కోల్పోతే, ఇక ఆ కుటుంబాలు ఎలా బతకాలి ? అలాంటి ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయనేది వాస్తవం. ఇప్పుడు ఆ కుటుంబాలకు దేవతలా సాయాన్ని అందిస్తోంది మంచు లక్ష్మీ.

    ఎవరు చేయని సేవను చేస్తోన్న మంచు లక్ష్మీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేస్తూ ‘అందరికీ నమస్కారం. ఈ కరోనా కష్ట కాలంలో నేను వ్య‌క్తిగ‌తంగా హాస్పిట‌ల్స్‌ లో బెడ్స్‌ను ఏర్పాటు చేసి, మందుల‌ను అందించ‌డం లాంటి సేవ కార్యక్రమాల్లో భాగమైనా, ఇప్పుడు టీచ్ ఫ‌ర్ చేంజ్ అనే స్వ‌చ్చంద సంస్థ‌తో క‌లిసి మ‌రింత సాయాన్ని అందించడానికి మరింత ప్రయత్నం చేస్తున్నాను.

    మనకు తెలుసు, ఈ కరోనా చాల కుటుంబాలను నాశనం చేసింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎంతోమంది బిడ్డలు తమ త‌ల్లిదండ్ర‌లను కోల్పోయారు. అయితే, అందులో వెయ్యి పేద కుటుంబాల‌ను గుర్తించి, ఆ కుటుంబాలలోని పిల్ల‌ల‌కు సరైన విద్య‌, అలాగే మంచి వైద్యంతో పాటు వారి అవసరాలకు కావాల్సిన ఇత‌ర ఆర్ధిక సాయాన్ని కూడా అందించాలని నిర్ణయించుకున్నాం. ఇక వైద్యం కోసం వచ్చి ఇబ్బందులు పడుతున్న వారికీ రోజుకు వెయ్యి భోజ‌నాల‌ను కూడా అందజేస్తున్నాం. ఈ సేవలో భాగమైన టీచ్ ఫ‌ర్ చేంజ్‌ కి, మా వాలంటీర్స్‌ కి, ఇత‌ర స‌భ్యులకి ధ‌న్య‌వాదాలు’’ అని తెలియజేసింది.