
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘దీపికా పడుకోణె’ అసలు గ్యాప్ లేకుండా సినిమాలు ఒప్పుకుంటూ ఈ క్రమంలో తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రభాస్ సరసన ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తీయనున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో ఈ స్టార్ హీరోయిన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఈ నెలలో దాదాపు ఇరవై రోజులు పాటు తన డేట్స్ ను కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆ డేట్స్ అన్ని వేస్ట్ అయిపోయినట్టే.
మళ్ళీ దీపికా నుండి డేట్స్ తెచ్చుకోవాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఉంది, ప్రస్తుతం ఆమె చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి, పైగా అన్ని భారీ సినిమాలే. అన్ని సినిమాల్లోని హీరోలూ స్టార్ హీరోలే. కాబట్టి, దీపికా ఆ స్టార్ హీరోల డేట్స్ కి అనుగుణంగా తన డేట్స్ ను ఇవ్వాల్సి ఉంది. కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడి, కరోనా సెకెండ్ వేవ్ తగ్గిన తర్వాత, అన్ని సినిమాల షూటింగ్స్ ఒకేసారి మొదలవుతాయి.
మరి అప్పుడు దీపికా అన్ని పెద్ద సినిమాలకు ఒకేసారి ఎలా డేట్స్ ఇవ్వగలదు. కచ్చితంగా ఆమె కోసం షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేసుకోవాల్సిందే. అసలుకే కరోనా కారణంగా నెలలు తరబడి టైం వేస్ట్ అయింది, ఇప్పుడు హీరోయిన్ కోసం కూడా నెలలు టైంను వేస్ట్ చేసుకునే స్థితిలో ఏ స్టార్ హీరో ఉండదు. ఇంతకీ దీపికా చేస్తున్న ఆ సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ డైరెక్క్షన్ లో వస్తోన్న మూవీతో పాటు,
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా వస్తోన్న “ఫైటర్”, అదే విధంగా షారుక్ హీరోగా వస్తోన్న “పఠాన్” మూవీ, ఇక శకున్ బాత్రా దర్శకత్వంలో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా రాబోతున్న ఓ రొమాంటిక్ డ్రామాలో కూడా దీపికా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆమె సినిమాల లిస్ట్ లో మహాభారత్, ఒక హాలీవుడ్ మూవీ రీమేక్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రభాస్ సినిమాకి ఈ ఏడాది దీపికా డేట్స్ దొరకడం ఇక కష్టమే. మరి ప్రభాస్ – నాగ్ అశ్విన్ టీమ్ ఏమి చేస్తోందో ?