భారత విమానాలపై నిషేధం పొడగించిన కెనడా

భారత విమానాలపై విధించిన బ్యాన్ ను కెనడా జూన్ 21వ తేదీ వరకు పొడగించింది. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 22న భారత్ తో పాటు పాక్ విమానాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల్లో చాలా మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం, కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వైరస్ ఉధృతి తగ్గకపోవడంతో మరోసారి బ్యాన్ ను పొడగించినట్లు కెనడా రవాణా శాఖ మంత్రి […]

Written By: Suresh, Updated On : May 22, 2021 9:37 am
Follow us on

భారత విమానాలపై విధించిన బ్యాన్ ను కెనడా జూన్ 21వ తేదీ వరకు పొడగించింది. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 22న భారత్ తో పాటు పాక్ విమానాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల్లో చాలా మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం, కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వైరస్ ఉధృతి తగ్గకపోవడంతో మరోసారి బ్యాన్ ను పొడగించినట్లు కెనడా రవాణా శాఖ మంత్రి అల్ఘాబ్రా పేర్కొన్నారు.