https://oktelugu.com/

‘వ‌కీల్ సాబ్‌’కు పోలీసుల షాక్.. అనుమతి లేదని ప్రకటన!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అప్ క‌మింగ్ మూవీ ‘వ‌కీల్ సాబ్’ మేనియా ఓ రేంజ్ లో కొన‌సాగుతోంది. 29న రిలీజ్ అయిన మూవీ ట్రైలర్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ జోష్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్రయత్నించారు. కానీ.. పోలీసులు రెడ్ సిగ్నల్ చూపించారు. సినిమా ప్రమోషన్ భారీగా నిర్వహించాలని నిర్ణయించుకున్న నిర్మాత దిల్ రాజు.. ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డానికి ప‌వ‌న్ ను కూడా ఒప్పించారు. గెస్టులుగా […]

Written By:
  • Rocky
  • , Updated On : March 31, 2021 / 10:12 AM IST
    Follow us on


    ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అప్ క‌మింగ్ మూవీ ‘వ‌కీల్ సాబ్’ మేనియా ఓ రేంజ్ లో కొన‌సాగుతోంది. 29న రిలీజ్ అయిన మూవీ ట్రైలర్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ జోష్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్రయత్నించారు. కానీ.. పోలీసులు రెడ్ సిగ్నల్ చూపించారు.

    సినిమా ప్రమోషన్ భారీగా నిర్వహించాలని నిర్ణయించుకున్న నిర్మాత దిల్ రాజు.. ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డానికి ప‌వ‌న్ ను కూడా ఒప్పించారు. గెస్టులుగా మెగా స్టార్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రావ‌డం కూడా ఖ‌రారైపోయింది. ఇక‌, కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డ‌మే మిగిలింది. ఈ లోగా ట్రైల‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో.. ఈ ప్రీరిలీజ్ వేడుక ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయ‌మ‌నే టాక్ వ‌చ్చింది,

    ఈ క్ర‌మంలోనే ఏప్రిల్ 3వ తేదీన యూసుఫ్‌ గూడ ఓలీస్ లైన్స్ లోని స్పోర్ట్స్ గ్రౌండ్ లో వేడుక నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేశారు. ఈ మేర‌కు అనుమ‌తి కోరుతూ పోలీసుల‌కు లేఖరాశారు. ఈ కార్య‌క్ర‌మానికి కేవ‌లం 5 వేల మందిని మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని కూడా వివ‌రించారు. కానీ.. పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు.

    క‌రోనా కేసులు ఎక్కువ‌గా పెరుగుతున్న వేళ అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా నేప‌థ్యంలో ఎలాంటి మీటింగులు, స‌భ‌లు, స‌మావేశాల‌కు అనుమ‌తి లేదంటూ ఇటీవ‌లే రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ ఉత్త‌ర్వులు జారీచేశారు. ఈ ఉత్త‌ర్వులు చూపిన పోలీసులు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేమ‌ని చెప్పారు. దీంతో.. ఫ్యాన్స్ తీవ్ర ఆవేద‌న‌లో కూరుకుపోయారు.