‘పవన్ కళ్యాణ్ చుట్టూ ఏదో తెలియని శక్తి దాగి ఉంది. సెట్ లో పవన్ అడుగుపెట్టిన వెంటనే అక్కడున్న వారంతా చేస్తోన్న పనిని ఆపేసి ఆయన్నే చూస్తుంటారు.’ అని టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిధి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇవిప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాన్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడింది. ‘తాను పవన్ కళ్యాన్ ను చూస్తూ పెరిగానని.. ఎప్పటికైనా ఆయనతో కలిసి పనిచేయాలనే కల ‘హరిహర’తో నిజమైందన్నారు. పవన్ అద్భుతమైన నటుడు అని.. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిస్తోందన్నారు.
పవన్ లో ఉన్న గొప్ప క్వాలిటీని నిధి బయటపెట్టింది. ఆయన ఏదైనా సన్నివేశం రిహార్సల్స్ చేయాల్సి వస్తే అదొక బాధ్యతగా కాకుండా చాలా ఆనందంగా చేస్తుంటారని.. ఈ చిత్రంలో భాగస్వామిని కావడం వల్ల ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు.
పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నా పాత్ర అసాధారణమైందని.. పీరియాడికల్ డ్రామా నేపథ్యం కావడంతో రాజసం ఉట్టిపడే వస్త్రాల్లోనే కనిపిస్తానంటూ సీక్రెట్ ను బయటపెట్టింది. ఈ సినిమా కోసం గంటన్నరసేపు మేకప్ వేసుకోవాల్సి వస్తోందని తెలిపారు.
హరిహర వీరమల్లు చిత్రంలో చారిత్రక వీరుడు ‘వజ్రాల దొంగ’గా పవన్ నటిస్తున్నాడు. ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.