మరి సాధారణ టాలెంట్ తో కృష్ణ అంత గొప్ప సూపర్ స్టార్ గా ఎలా ఎదిగాడో నేటి తరం ప్రేక్షకులకు తెలియదు. నిజానికి ఈ సందేహం అప్పట్లో కూడా చాలా మందికి ఉండేది. కృష్ణ స్టార్ డమ్ వెనుక చాలా కారణాలే ఉన్నాయి. సినిమా వ్యాపారం మీద కృష్ణకు లోతైన అవగాహన ఉండేది. అలాగే ఎన్నుకునే కథల పై మంచి అభిరుచి ఉండేది.
అందుకే కృష్ణ సినిమాలు వ్యాపారంలో ఎప్పుడూ నష్టపోలేదు. పైగా కృష్ణకు ఉన్న అవగాహన కూడా చాలా లోతుగా ఉండేది. అసలు ఏ కథను ఏ దర్శకుడు బాగా తీస్తాడు ? అసలు ఒక సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలి ? అలాగే తీసిన సినిమా ఎన్ని కేంద్రాల్లో ఎన్నాళ్ళు ఆడి, ఏ మాత్రం సంపాదించ గలుగుతుంది ? లాంటి విషయాల్లో కూడా కృష్ణకు స్పష్టమైన సమాచారం ఉండేది.
కృష్ణకు ఇంతటి గొప్ప సినీ వ్యాపార అనుభవం ఉంది కాబట్టే.. ఆయన నిర్మాతలు ఎప్పుడు భారీగా నష్టపోలేదు. అన్నిటికి మించి తన బలం, బలహీనతల మీద స్పష్టమైన అవగాహన ఉండటం కూడా ఆయనకు బాగా ప్లస్ అయింది. ఇక తన ప్రేక్షకులను బాగా అర్థం చేసుకోవడంలో కృష్ణ ఎప్పుడు ముందు ఉండేవారు.
పైగా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఒక విభిన్నమైన అనుభవం ఇవ్వడం కోసం ఆయన ఎప్పుడు తపన పడేవారు. అలాగే సాంకేతికత పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టేవాడు. ఈ క్రమంలోనే 1974లో తొలి సినిమా స్కోప్ సినిమాగా అల్లూరి సీతారామరాజు, 1982లో తొలి ఈస్ట్‌మన్ కలర్ సినిమాగా ఈనాడు, 1986లో తొలి 70 ఎంఎం సినిమాగా సింహాసనం, చివరకి 1995లో తొలి డీటీఎస్ సినిమాగా తెలుగు వీర లేవరా- ఇవన్నీ ఆయన తెచ్చిన సాంకేతిక మార్పులే. అందుకే సాధారణ కృష్ణ.. సూపర్ కృష్ణ అయ్యాడు.