Lenin Success Meet: అందం , టాలెంట్ ఈ రెండు ఒకే హీరోయిన్ లో ఉండడం చాలా అరుదు. ఈమధ్య కాలంలో మన ఇండస్ట్రీ కి వచ్చిన హీరోయిన్స్ లో ఈ రెండు లక్షణాలు ఉన్న హీరోయిన్స్ లో ఒకరు భాగ్యశ్రీ భొర్సే . ఈమె ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ హీరోయిన్ భాగ్యశ్రీ పేరు మాత్రం ఇండస్ట్రీ లో ఒక రేంజ్ లో మారుమోగిపోయింది. వరుసగా అవకాశాలు వచ్చాయి , కానీ సక్సెస్ మాత్రం రాలేదు. ఈ చిత్రం తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘కింగ్డమ్’, ‘కాంతా’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అయినప్పటికీ ఈమెకు క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇక ఈమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైంది.
మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. అఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ ని సాధించడమే కాకుండా , మొట్టమొదటి సూపర్ హిట్ గా కూడా నిల్చింది ఈ చిత్రం. కేవలం అఖిల్ కెరీర్ లోనే కాదు , భాగ్యశ్రీ కెరీర్ లో కూడా ఈ సినిమా మొట్టమొదటి కమర్షియల్ హిట్ గా నిల్చింది. నేడు హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ సక్సెస్ మీట్ లో భాగ్యశ్రీ మాట్లాడుతూ కంటతడి పెట్టుకుంది. తన ఎమోషన్స్ ని స్టేజి మీద కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే కెరీర్ ప్రారంభం నుండి ఒక్క హిట్ కూడా లేకపోవడం తో ఈమెపై సోషల్ మీడియా లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు.
ఇలాంటివి చూసినప్పుడు ఏ హీరోయిన్ కి అయినా చాలా బాధ వేస్తుంది. అనే వాళ్ళది ఎందుని , చేతిలో మొబైల్ , ఇంటర్నెట్ ఉంటే చాలు , నోటికి ఎదోస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఈరోజు కోసం నేను చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను అంటూ భాగ్యశ్రీ కంటతడి పెట్టుకుంది. ఇకపోతే ఈ చిత్రం రెండవ రోజు కూడా అన్ని ప్రాంతాల్లో దుమ్ము లేపేసింది. ఊపు చూస్తుంటే కేవలం వీకెండ్ కి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
#BhagyashriBorse got emotional at the #Lenin Success Meet and said her last film will definitely be a Telugu film.
She also called Hyderabad her Karmabhoomi. pic.twitter.com/y3PUhWjh9f
— Movies4u Official (@Movies4u_Officl) July 11, 2026
