https://oktelugu.com/

Coronavirus: కరోనాకు ఆ పాము విషమే విరుగుడు.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..?

Coronavirus: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాము విషంతో కరోనాకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా పాము విషం ప్రాణాలను తీస్తుందనే సంగతి తెలిసిందే. అయితే పాము విషంను ఔషధంగా మారిస్తే ఆ విషమే ప్రాణాలను నిలిపే అవకాశాలు ఉంటాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేసే గుణం పాము విషంలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాలిక్యూల్స్ అనే జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. బ్రెజిల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 1, 2021 / 04:50 PM IST
    Follow us on

    Coronavirus: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాము విషంతో కరోనాకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా పాము విషం ప్రాణాలను తీస్తుందనే సంగతి తెలిసిందే. అయితే పాము విషంను ఔషధంగా మారిస్తే ఆ విషమే ప్రాణాలను నిలిపే అవకాశాలు ఉంటాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేసే గుణం పాము విషంలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    మాలిక్యూల్స్ అనే జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. బ్రెజిల్ లోని ఒక రకమైన రక్తపింజరి విషంతో కరోనాకు చెక్ పెట్టవచ్చని ఆ విషంలో ఉండే ఒక పదార్థం కోతిలో వైరస్ పునరుత్పత్తిని అపిందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. రక్తపింజరి విషాన్ని చికిత్సలో వినియోగించిన తర్వాత దాదాపు 75 శాతం వైరస్ పునరుత్పత్తి నిలిచిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    ప్రొఫెసర్ రఫైల్ గైడో వైపర్ విషంలో ఉండే పెప్టైడ్ కరోనా పునరుత్పత్తిలో కీలక పాత్ర పోషించే పీఎల్ప్రో అనే ఎంజైమ్ కు అనుసంధానమవుతోందని పేర్కొన్నారు. ప్రయోగశాలల్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న పెప్టైడ్ ను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. జంతువులపై చేసే ప్రయోగాలు సక్సెస్ అయితే మానవులపై కూడా ప్రయోగాలు చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.

    జరరకుస్సు అనే వైపర్ సర్పం బ్రెజిల్ లో కనిపించే అతిపెద్ద సర్పాలలో ఒకటి. ఈ పాము విషంతోనే కరోనాకు చెక్ పెట్టవచ్చు. పరాగ్వే, అర్జెంటీనా, బొలీవియా దేశాలలో ఈ రకం పాములు కనిపిస్తూ ఉంటాయి. శాస్త్రవేత్తల ప్రయోగాలు సక్సెస్ అయితే భవిష్యత్తులో పాము విషం కరోనాకు ఔషధంగా పని చేసే అవకాశాలు ఉంటాయి.